ఇటీవల అమెరికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా చైనా పై దూకుడుగా వ్యవహరించాలని గట్టిగా విభేదించాలని అమెరికా చెప్పినా తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే తప్పకుండా ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసని మోదీ అన్నారు. కానీ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఈ మధ్య చైనాలో పర్యటించారు. చైనా చేస్తున్న ఆధిపత్య పోకడలను అడ్డుకోవాల్సిన అమెరికా స్తబ్దుగా ఉండటం మంచిది కాదని ప్రపంచ మేధావులు విశ్లేషిస్తున్నారు.
ఇలాంటి సందర్భంలో తైవాన్ పై చైనా తమలో కలిపేసుకోవాలని సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో ముందుకు వెళుతున్నా.. అమెరికా మొన్నటి వరకు మద్దతు ఇచ్చి ప్రస్తుతం పట్టించుకోకపోవడం వల్ల తైవాన్ పరిస్థి ఏమతుందనే భావన ప్రపంచంలో ఆందోళన కలిగిస్తోంది. ఆ మధ్య బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆఫ్టానిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు.
ఆఫ్గానిస్తాన్ నుంచి సైనిక బలగాల ఉప సంహరణ తర్వాత ఆఫ్గాన్ లో తాలిబాన్ల ఆరాచకలు అన్నీ ఇన్నీ కావు. మహిళలకు చదువు లేదు. కేవలం ఇంటికి పరిమితం కావడం, అడ్డు పడిన వారిని కాల్చి చంపడం. ఆర్థికంగా ఇబ్బందులు, తిండికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి. ఇలాంటి దారుణమైన పరిస్థితులకు కారణం అమెరికా.. కాబట్టి చైనా విస్తరణ కాంక్షను అడ్డుకోవడానికి వివిధ దేశాలకు సాయం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఉంది. కాబట్టి చైనా ను కట్టడి చేసి ఇండో పసిపిక్ మహా సముద్ర జలాల్లో దాని ఆధిపత్యానికి గండి కొట్టాలి. ఆస్ట్రేలియా, జపాన్, పిలిప్పీన్, తైవాన్, ఇండియా లాంటి దేశాలను కాపాడుకోవాలి.