అయితే వీళ్ళు ఈ వర్గపు ప్రజలకు అంటే రైతులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా కేంద్రం ఇచ్చే పథకాల లాంటివే తాము కూడా అవే పథకాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తుంటాయని తెలుస్తుంది. కాకపోతే పేరు మార్చి పథకాలు ప్రవేశపెడతారు అంతే. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చే రేషన్ పథకాన్ని పర్టిక్యులర్ గా కరోనా టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత రేషన్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నాయి అని కొంతమంది అంటున్నారు.
అలాగే కేంద్రం రైతుల కోసం ఇచ్చే రైతు బంధు పథకం లానే రాష్ట్రంలో రైతు భరోసా ఇస్తున్నారు. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సొమ్మును కూడా వీళ్లు ఇచ్చే సొమ్ముతో కలిపి ప్రకటించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అచ్చం ఇలాంటిదే మరొకటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చూసి ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తుంది. అదే పెన్షన్ స్కీమ్. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఓపిఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమును ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు.
అయినా కూడా పెన్షన్ తో ఉద్యోగికి భద్రత కల్పించే స్కీం ముందు నుండి ఉంది. అయితే వాటిలో ఓపిఎస్, సిపిఎస్, జిపిఎస్ అని వాటిని మూడు వర్గాలు గా కేటాయిస్తారు. సిపిఎస్ లో గత పెన్షన్ స్కీం కన్నా మెరుగైన పెన్షన్ స్కీం ని కేంద్ర ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. జగన్ ప్రభుత్వం కూడా ఈ దారిలోనే ఉందంటున్నారు.