జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు సూటిగానే విమర్శిస్తూ ఉంటారు. అలాగే జగన్ కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉండే విషయమే. అయితే ఇటీవల  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ప్రచార రథం వారాహిపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.


వారాహి ప్రచార రధానికి వారాహి అనే ఒక అమ్మవారి పేరు పెట్టడం అయితే జరిగింది. అయితే ఈ రథం యొక్క వారాహి అనే పేరుపై గతంలోనే వైఎస్సార్సీపీకి చెందిన కొంత మంది నాయకులు ఆ పేరును తప్పుగా విమర్శించడం అయితే జరిగింది. ఆ నాయకులు వారాహి అనే పదానికి పంది అని  అర్థం వస్తుంది అన్నట్లుగా చెప్పి విమర్శించారు. కానీ ఆ రథం యొక్క  పేరు వెనుక ఉన్న అర్థం తెలిసిన వాళ్ళకి ఈ మాట నచ్చలేదు.


కాగా తాజాగా వైఎస్ఆర్సిపి అధినేత జగన్ కూడా అమ్మ వారి పేరైన వారాహి పదాన్ని వరాహి అని పలకడం జరిగింది. దాంతో జగన్ చేసిన ఆ తప్పుడు  ఉచ్చారణ పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జగన్ ని తీవ్రంగా దుయ్యబట్టారు. జగన్ కి  తెలుగు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు ఇలాంటివి రావని ఆయన అన్నారు. ఇలాంటి తెలుగు రాని ఒక వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం బాధాకరం అన్నట్లుగా ఆయన స్పందించారు.


దానికోసం జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద భవిష్యత్తులో ఆయనకు తెలుగు నేర్పిద్దాం అని ఆయన అన్నారు. తిరిగి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను ప్రసంగించేటప్పుడు ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ అంటున్నారని కాబట్టి ఇక నుండి ఆ విధంగా కాకుండా ఈ విధంగా చేస్తాను అంటూ జగన్ తీరుని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా పవన్ కళ్యాణ్  వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: