దానికి అసలు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కనుక సింగిల్ గా పోటీ చేస్తే తాము ఈజీగా, ఏ ప్రాబ్లం లేకుండా గెలిచేయొచ్చని వాళ్ళ లెక్క. అదే పవన్ కళ్యాణ్ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం పార్టీతో కలిస్తే కొంతవరకు వాళ్ళ విజయానికి గండి పడినట్లుగా ఉంటుంది. అదే ఒకవేళ జనసేన, తెలుగుదేశం ఇంకా బీజేపీతో కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తమ గెలుపుపై ఒక అపనమ్మకం అనేది ఏర్పడిపోతుంది.
ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి. బండి సంజయ్ అక్కడ ఎంఐఎం ను అక్కడ ఉన్నటువంటి 119 స్థానాల్లోనూ పోటీ చేయమని సవాల్ చేస్తున్నాడట. అయితే ఇక్కడ ఇప్పుడు ఎంఐఎం 119 స్థానాల్లో కనుక పోటీ చేసేలా ఉంటే అది కెసిఆర్ పార్టీ టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ ను దెబ్బ కొట్టినట్లుగా ఉంటుంది. గతంలో తెలంగాణలో ఎంఐఎంకు ఇంకా టిఆర్ఎస్ కు మధ్యన పొత్తు లేదంటూనే ఇంటర్నల్ గా పొత్తుని పెట్టుకున్నారు.
అలాగే ఓవైసీను కూడా కాపాడుకుంటూ వచ్చారు. అదేవిధంగా మిగతా నియోజకవర్గాల్లో కూడా తమకు సీట్లు కావాలని కూడా అడిగారు. అయితే అలాంటి ఎంఐఎం ఆ తర్వాత పాత బస్తీ వరకూ మాత్రమే పరిమితం అయింది. అలాగే మిగతా చోట్ల టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం వలన ఎంఐఎం విజయం సాధించింది గతంలో. ఇప్పుడు ఒకవేళ ఎంఐఎం 119స్థానాల్లో గనుక పోటీ చేయకపోతే ఎంఐఎం ఇంకా టిఆర్ఎస్ కలిసి ఉన్నాయని చెప్పి హిందువుల ఓట్లను కొల్లగొట్టే లెక్క అది.