అందుకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐ ఎఫ్ పి లను ఏర్పాటు చేయాలని గతం లోనే నిర్ణయించుకుంది . ఐ ఎఫ్ పి అంటే ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్. పాఠ్యాంశాలను ఈ ఐ ఎఫ్ పి స్క్రీన్స్ ద్వారా పిల్లలకు అర్థమయ్యేలా, ఆసక్తి కలిగేలా విద్యను బోధించడానికి అవకాశం ఉంటుంది. నాడు-నేడు లో భాగంగా పిల్లలకు యూనిఫామ్స్ అలాగే పుస్తకాలతో పాటుగా ఈ ఐ ఎఫ్ పిలను కూడా ఏర్పాటు చేసింది.
వీటికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లలో బడ్జెట్ ను కేటాయించింది. పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీటిని అన్ని ప్రభుత్వ పాఠశాలల లోనూ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టారు. అయితే వీటి పనితీరు ఏ విధంగా ఉందో పరిశీలించాలని ప్రవీణ్ ప్రకాష్ ఈమధ్య అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారని సమాచారం. అయితే ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి ఈ ఐ ఎఫ్ సి లను స్కూళ్ళకి ఇస్తే అక్కడ వాటిని ప్రసారం చేయడానికి విద్యుత్ సదుపాయం లేదని గమనించారు ఆయన.
దాంతో ఆయన సత్వరమే అన్ని ప్రభుత్వ పాఠశాలలోనూ ఈ ఐ ఎఫ్ పీ ప్రసారాలు అందుబాటులోకి వచ్చేలా, విద్యుత్ సదుపాయానికి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నాడు నేడు మొదటి దశ పూర్తయిన నేపథ్యంలో అన్ని పాఠశాలలలో వీటి పనితీరును నిర్ధారించాలని ఆయన అన్నారని సమాచారం.