గతంలో విజయవాడ ఈ రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండేదని చాలా మంది అంటారు. అలాగే ఆంధ్రలో జిల్లాకు ఒక రౌడీ నాయకత్వం నడిచేదని చెబుతారు. అయితే ఇవన్నీ చంద్ర బాబు అధికారంలోకి వచ్చే వరకు మాత్రమే నడిచాయని తెలుస్తుంది. చంద్ర బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీయిజాన్ని అంతం అయితే చేయలేదు గాని చాలా వరకు కంట్రోల్ చేశారని సమాచారం. చంద్ర బాబు రౌడీయిజం చేసే వాళ్ళు తమ పార్టీలో ఉన్నా నిర్ధాక్షిణ్యంగా చర్యలు తీసుకునే వారని అంటారు.
చంద్రబాబు గురించి గొప్పగా చెప్పుకోవాలనుకునే విషయాల్లో రౌడీయిజాన్ని కంట్రోల్ చేసిన ఘనత మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే తరహాలో రౌడీయిజంపై ఉక్కు పాదం పెట్టారని సమాచారం. ఆయన రౌడీయిజాన్ని కూకటి వేళ్ళతో పెకిలించేయడానికి ప్రయత్నిస్తున్నారు అని సమాచారం.
ఉత్తర ప్రదేశ్ లో 7 దశాబ్దాలుగా మత వ్యవహారాల్ని అడ్డు పెట్టుకొని దందాలు నడిపేటటువంటి అజాంఖాన్ లాంటి వ్యక్తిని దెబ్బ తీశాడు యోగి ఆదిత్యనాథ్. గతంలో ముఖ్యంగా గుజరాత్ లో మత రాజకీయాలను అడ్డుపెట్టుకొని మైనార్టీ వర్గాలు రౌడీయిజం ని నడుపుతూ ఉండేవారని సమాచారం. అయితే అలాంటి వాళ్ళందరినీ కూడా ఏరిపారేస్తూ వచ్చారట యోగి ఆదిత్యనాథ్. కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉండే లతీఫ్ అనే అరాచక వాదిని కూడా అరెస్ట్ చేయించారట గుజరాత్ కు సంబంధించిన నేతలు.