
న్యాయవ్యవస్థలో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కోర్టు కేసుల్లో జాప్యం, న్యాయమూర్తులు సరైనంత మంది లేకపోవడం, కేసుల వాదనలు ఎక్కువ రోజులు జరగడం లాంటివి చేయడం వల్ల అనేకమైన మార్పులు వస్తున్నాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు విషయంలో ఇదే జరిగింది. వనమా వెంకటేశ్వర రావు ఎన్నికల్లో తప్పుడు అపిడవిట్లను సమర్పించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడని ప్రత్యర్థి జలగం వెంకట్రావు కోర్టులో కేసు వేశారు.
దాదాపు నాలుగున్నర సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు ఇచ్చింది. 2019 డిసెంబర్ నుంచే ఆయన ఎమ్మెల్యేగా పదవిలో ఉన్నట్లేనని తెలిపింది. దీని వల్ల జలగం ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లయింది. అయితే పుణ్య కాలం కాస్త అయిపోయిన తర్వాత తీర్పు వచ్చినట్లయింది. దాదాపు మరో నాలుగైదు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో తీర్పు రావడం పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఇన్ని రోజులు నష్టపోయినట్లే కదా? మరి ఇలాంటి తీర్పుతో ఆ ఎమ్మెల్యేకు ఏం లాభం కలుగుతుంది.
మహా అయితే నాలుగున్నర సంవత్సరాలుగా రావాల్సిన జీతాన్ని ఇస్తారు. కానీ ఏ లక్ష్యంతో అయితే ఎమ్మెల్యే కావాలని అనుకున్నారో దానికి నాలుగున్నరేళ్లుగా దూరంగా ఉన్నట్లే. కాబట్టి దేశ వ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఉన్న వివిధ కేసుల దర్యాప్తు తీరును వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలి. న్యాయవ్యవస్థ మీద ప్రజలకు మరింత నమ్మకం పెంపొందేలా కోర్టుల్లో తీర్పు వేగంగా రావాల్సిన అవసరముంది.