
కారణం వీరందరికీ హైదరాబాదులో కోట్ల కొద్ది ఆస్తులు ఉండడం ఏమాత్రం మాట్లాడిన కూడా కేసీఆర్ సర్కారు వారి ఆస్తుల్ని ఏం చేస్తారోనని భయం పట్టుకుందని విమర్శలు వస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక విద్యార్థులే హైకోర్టులో కేసు వేశారు ఆ సమయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంత వరకు ఓకే గాని తర్వాత హైకోర్టు స్టే ఎత్తివేసింది. దీంతో తెలంగాణలో మెడిసిన్ చేయలనుకుంటున్న ఆంధ్ర విద్యార్థులకు ఇన్ని రాజకీయ పార్టీలు ఉండి కూడా కనీసం ఆంధ్ర విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నారు.
ప్రభుత్వం తరఫున కోర్టు లో కేసు వాదించడానికి గెలిపించడానికి కేవలం అభ్యర్థులు మాత్రమే హైకోర్టులో కేసు వేసుకొని పోరాడాల్సి వచ్చింది. ఇన్ని రాజకీయ పార్టీలు ఉండి ఇంత ప్రజాప్రతినిధులు ఉండి కూడా ఆంధ్ర విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నారు. మెడికల్ సీట్లను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటే కనీసం దానిపై మాట్లాడడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు దీని ద్వారా పూర్తిగా ఆంధ్ర విద్యార్థులు నష్టపోతున్నారు.
ఈ విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా గాని తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించే ప్రయత్నం చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలు వైసీపీ టిడిపి జనసేన పార్టీలు తిట్టుకోవడం మాని రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేయాలంటున్నారు. కానీ ఈ ప్రజాప్రతినిధులు ఇవేవీ పట్టించుకోకుండా ఓట్లు సీట్లు అంటూ రాజకీయాలు చేస్తున్నారు.