పెట్టుబడులు పెట్టడానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అని వచ్చిన వాళ్ళకి అనిపించే విధంగా స్థలం ఉండాలి అని అంటారు. తెలంగాణలో ఇండస్ట్రీల జోలికి వెళ్ళరు. కానీ కెసిఆర్ కు అభిమానులైనటువంటి వ్యాపారవేత్తలను, పారిశ్రామికవేత్తలను కాంగ్రెస్ పార్టీ వెంటాడుతుందని అంటున్నారు కొంతమంది రాజకీయ వేత్తలు. తెలంగాణలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ వాళ్ళవి కదా అని ఎవరి పరిశ్రమలను, వ్యాపారాలను నాశనం చేయడం లేదు. వివేక్ కు సంబంధించిన పరిశ్రమలు గాని, కోమటిరెడ్డి కి సంబంధించిన పరిశ్రమలు గానీ దెబ్బ తీయడానికి చూడడం లేదు బిఆర్ఎస్ పార్టీ.
ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ వ్యాపారాన్ని వ్యాపారం కింద, రాజకీయాన్ని రాజకీయం కిందా చూడడం ఒక విశేషం. కానీ కాంగ్రెస్ పద్ధతి బిఆర్ఎస్ లా లేదు అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం వాళ్ళ వ్యాపారాలను నాశనం చేయాలి, వాళ్ళపై బురద జల్లాలి అని భావిస్తుందని తెలుస్తుంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి స్వంత పగ కాంగ్రెస్ పగలా మారిన పరిస్థితి. కాబట్టి ప్రత్యేకించి వీళ్ళు గెలుస్తారు అనుకుంటే మాత్రమే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెడతారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు ఆనుకూలురు అయిన ఇండస్ట్రియలిస్ట్ లను జగన్ వేధిస్తాడని, అలాగే కాంగ్రెస్ అనుకూలురు అయినటువంటి ఇండస్ట్రియలిస్ట్ లను చంద్రబాబు వేధిస్తాడని అంటుంటారు.