అమెరికా ఇచ్చిన డబ్బులతో పాకిస్తాన్ తయారు చేసిన తాలిబాన్ లు అనేక దేశాలకు ముప్పులా మారారు ఇప్పుడు. ప్రత్యేకించి రష్యాను దెబ్బ కొట్టడానికి అమెరికా వీళ్ళను ఉపయోగిస్తుంది అని అంటారు రాజకీయ నిపుణులు. అయితే వీళ్ళు అమెరికాకి ఎదురు తిరిగి బిన్ లాడెన్ ఆధ్వర్యంలో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను కూల్చి వేయడం మనకు తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన ఆల్ జవహరీ ని కూడా హతమార్చింది అమెరికా.
ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ను ఆధీనంలోకి తీసుకొని అక్కడ 20 ఏళ్ల నుండి ఈ తాలిబన్లకు వ్యతిరేకమైన వర్గంతో ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చింది అమెరికా. కానీ ఇప్పుడు తమకు అవసరం లేదనుకుంటూ తాలిబన్లతోనే చర్చలు పెట్టుకుంటూ, ఇప్పుడు వాళ్లకి ఆఫ్ఘనిస్తాన్ ను వదిలి పెట్టి అక్కడ నుండి వచ్చేసింది అమెరికా. అయితే ఉక్రెయిన్ నుండి స్వాధీనం చేసుకున్న డొనేట్ స్కీ, లోపాన్ స్కీ, జెపోరీజియా, కేర్సన్ వంటి ప్రాంతంలో గవర్నర్లను నియమించి తద్వారా పాత యు ఎస్ ఎస్ ఆర్ ను పునః సృష్టించబోతున్నారు పుతిన్.
దానికోసం ఆయన అక్కడ ఎలక్షన్స్ పెట్టబోతున్నారు అయితే ఇది తెలిసిన అమెరికా రష్యా పై మండిపడుతుంది. దానికి బదులుగా రష్యా చెప్పేది ఏమిటంటే అక్కడ ప్రజలతో ప్రజాస్వామికంగానే ఎలక్షన్స్ పెట్టబోతున్నామని అలాంటప్పుడు మాది యుద్ధ ఉన్మాదం ఎలా అవుతుంది అని రష్యా అంటుంది.