తెలంగాణలో రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్ దూకుడు కొనసాగిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దాదాపు 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలో అంతర్మథనం పెరిగిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం రోజువారీ టికెట్ల ప్రక్రియలో చర్చ సాగుతూనే ఉంది. అయితే కర్ణాటక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అసలు ఏ మాత్రం పోటీ లో లేని విషయం తెలిసిందే.


కర్ణాటకలో గెలుపు అనంతరం దూకుడు కొనసాగిస్తూ తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలెట్టింది. దీని కోసం అభ్యర్థల ఎంపికలో చాలా కసరత్తులు చేస్తుంది. ఎవరూ గెలిచే అవకాశం ఉంది. ఎవరూ గట్టి పోటీ ఇవ్వగలరనే అభ్యర్థుల కోసం అన్వేషణ సాగుతుంది. దీని కోసం స్క్రీనింగ్ కమిటీ ప్రతి రోజు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు తెప్పించుకుని అన్ని ఆలోచిస్తుంది.


కాంగ్రెస్ కూడా అతి త్వరలో 75 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో వారు ప్రచారం చేసుకోవడానికి వీలవుతుంది. రెండు నెలల్లోనే ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులకు కూడా వీలయ్యే విధంగా ప్రతి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేయడానికి వెళ్లేందుకు, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ముందుకు వెళ్లనున్నారు. ముఖ్యంగా ఈ ఎన్నికలను కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.


కాబట్టి ఎలాగైన గెలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటున్నారు. దీనికి తోడు ఇక్కడ ఉన్న అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీని గెలిపించేందుకు అందరూ కలిసి పోరాడాలని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ గెలుపు కోసం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ అహన్ని పక్కనబెట్టి కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని సోనియా ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. మరి తెలంగాణలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన కాంగ్రెస్ జోరు ఎన్నికల వరకు కొనసాగి గెలుస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: