రాజకీయాల్లో ఒకరిని ఒకరు ఓడించేందుక సర్వ శక్తులూ ఒడ్డుతుంటారు. అది ఏ విధంగా అయినా కావొచ్చు. కొంత మంది పొత్తులు పెట్టుకుంటారు. మరికొంత మంది రాజకీయ నాయకులు అంతర్గతంగా సహకరించుకుంటారు. ఉదా.. టీడీపీని ఓడించేందుకు 2009లో ప్రజారాజ్యం పార్టీని వైఎస్సారే తీసుకువచ్చారని అప్పట్లో చంద్రబాబు  ఆరోపించారు. అదే విధంగా 2019 ఎన్నికల్లో వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని పావుగా వాడుకున్నారన్న ఆరోపణలున్నాయి.


మానసిక వ్యాధితో బాధపడుతున్న కేఏపాల్ చుట్టూ ఉన్న వాళ్లను తమకు అనుకూలంగా మార్చుకొని  ఆ పార్టీ తరఫున వందలాది బీ ఫాంలు టీడీపీ నేతలు తీసుకున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. వాటితో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల పేర్లకు దగ్గరగా ప్రజాశాంతి తరఫున బరిలో నింపారన్నది వారి ఆరోపణ. ఉదాహరణకు వైసీపీ తరఫున లక్ష్మీనారయణ బరిలో ఉంటే ప్రజాశాంతి నుంచి కే.ఎల్.నారాయణ పోటీలో ఉండేలా చూశారు. హెలికాఫ్టర్ గుర్తుకు ఉన్న ఫ్యాన్ ను ఎక్కువగా  కనిపించేలా జాగ్రత్తలు వహించారు.


ఇప్పుడు అదే తరహాలో జనసేనపై వైసీపీ కుట్రపన్నుతోందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని ప్రకటించాయి. కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. కొన్ని రోజులుగా టీడీపీ అనుకూల మీడియాలో పవన్ కల్యాణ్ కు బాగా ప్రచారం కల్పిస్తున్నారు. టీడీపీతో జనసేన పొత్తులో లేకుంటే అంతగా ప్రాధాన్యం ఇవ్వరు.


పవన్ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరిగినా మీడియాలో ఎలాంటి సానుభూతి వార్తలు రావు. ఇప్పుడైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో పెడితేనే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అదేంటంటే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ జనసేన పార్టీ పేరును ఆమోదించింది. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుకు పోలిన మాదిరిగా ఉండే బకెట్‌ను వీరికి కేటాయించింది. ఇది ఎవరో పెట్టారో ఇంకా తెలియరాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: