ఏదైనా  పని జరగాలంటే మనం ఏం చేస్తాం. సర్దుకుపోతాం. లేకుంటా కొట్లాడుతాం.  సీఎం గా ఉన్నప్పుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవస్థలతో సర్దుకుపోతే..  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవస్థలను ఎదురిస్తున్నాడు.  జగన్ కు ఇంత తెగింపు ఏంటి అని వాళ్ల పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.


ఇలా తెగించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో పార్టీ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ప్రశ్నార్థకం. ఉదాహరణకు చూసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అప్పటి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్కుమార్   వాటిని వాయిదా వేస్తూ దాటవేస్తుంటే ఆయనపై ఏకంగా కులపు ఆరోపణలు చేశారు. అలాగే చీఫ్ జస్టిస్ కాబోయే జస్టిస్ ఎన్.వి. రమణ పై ఆ సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఉంటే భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టుకు లేఖ రాయడం అప్పట్లో సంచలనం.


అలాగే ఎన్నికలకు ఆరు నెలల ముందు సీఐడీ చేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అరెస్టు చేయించడం ఎవరూ ఊహించనదే. ఇవన్నీ ప్రత్యర్థులపై కాబట్టి రాజకీయ వ్యూహం అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరికలు ఇస్తూ.. జనవరిలో మరోసారి సర్వే ఫలితాలు వస్తాయి.. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కొంతమందిని తప్పించక పోవడం మినహా నా దగ్గర ఎటువంటి అవకాశం లేదు అని తేల్చి చెప్పారు.
 

ఈ సమయంలో సిట్టింగ్ లను మార్చితే వాళ్లు ఎదురు  తిరిగి పార్టీ మారితే వైఎస్ జగన్ కు కొంత ఇబ్బందే. తనను తాను నమ్ముతున్నాడు. అదే సమయంలో తనను  పార్టీ శ్రేణులను నమ్మని చెప్తున్నాడు. అయినా ఎందుకీ తొందర నిర్ణయాలు అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. కానీ తాను తీసుకున్న నిర్ణయంలో మొండిగా ముందుకు వెళ్లడం జగన్ లక్షణం. ఈ నిర్ణయాలు అతనికి కలిసి వస్తాయా లేదా అనేది రేపటి ఎన్నికల్లో తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: