రష్యాతో యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా చేసి నాటో దేశాలు విసిగిపోయాయి. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ఆయుధ సరఫరాను తగ్గిస్తూ వస్తున్నాయి. కానీ అమెరికా నుంచి నాటో దేశాలకు ఒత్తిడి వస్తోంది. మీ దగ్గర ఉన్న పాత ఆయుధాలను వదిలించుకోండి అవసరమైతే కొత్త ఆయుధాలను మేమిస్తాం అని చెబుతోంది. ఇజ్రాయెల్ ఉక్రెయిన్ కు సహకారం అందిస్తే అది రష్యాను దీటుగా ఎదుర్కొంటుందని పెంటగాన్ వ్యూహం.
ఇజ్రాయెల్ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభం నుంచి తటస్థంగా ఉంటూ వస్తోంది. మూడు నెలల క్రితం జెలన్ స్కీ ఇజ్రాయెల్ కు మానవత్వం అంటే ఏంటో తెలియదు అని ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీనికి నెతన్యాహూ బదులిస్తూ ముందు మీ ఇంటిని చక్కబెట్టుకో మాకు నీతులు చెప్తే తగిన గుణపాఠం చెబుతానని తీవ్రంగా హెచ్చరించారు.
ఇజ్రాయెల్ కు రష్యాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు. అందుకే భారత్ లా తటస్థంగా ఉంటుంది. ఈ నెలలో ఇజ్రాయెల్ తో సౌదీ వాణిజ్య వ్యవసాయ రంగాల్లో పరస్పర ఒప్పందం చేసుకోబోతున్న తరుణంలో హమాస్ దాడి చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాలోని మసీదులను కూల్చివేసింది. ఇది సౌదీకి నచ్చకపోతే ఒప్పందం రద్దవుతోంది. పుతిన్ కి, ఇరాన్ కి కావాల్సింది కూడా అదే. ఏ దేశ ప్రయోజనాల కోసం ఇదంతా జరుగుతోంది అనేది ఎప్పటికి అర్థం కాదు. ఇప్పుడు అగ్రరాజ్యాలుగా పిలవబడుతున్న దేశాలన్నీ ప్రధాని మోదీ వద్దకు వచ్చి తమ పంచయితీలు పరిష్కరించమని కోరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.