రైతులకు కూడా మొత్తం ఇస్తానని చెప్పి వాణిజ్య పంటలకు రుణ మాఫీ ఇవ్వలేదు. సంపూర్ణ రుణ మాఫీ చేయకుండా పసుపు, కుంకుమ అని చివర్లో పథకం తెచ్చి ప్రతి కుటంబానికి డబ్బులు వేశారు. అయితే పసుపు కుంకుమ టీడీపీని గెలిపిస్తుందని చంద్రబాబు ధీమాగా ఉంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. 23 స్థానాలకే పరిమితం చేసి టీడీపీని చావు దెబ్బ కొట్టారు.
అయితే రాబోయే ఎన్నికల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని చెప్పుకొనే టీడీపీ నాయకులు మాత్రం వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు జేసిందని విమర్శలు చేస్తున్నారు. మరి టీడీపీ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి తెస్తుంది. ఆకాశం నుంచి తీసుకువస్తుందా అంటే అది ఎలా తెస్తుందో మాత్రం చెప్పడం లేదు. చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలో 2018-19 సంవత్సరంలో 2100 కోట్లు నెలకు జీఎస్టీ ఆదాయం ఉంటే.. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో 3800 కోట్ల రూపాయలకు ఆదాయం పెరిగింది. అంటే ప్రభుత్వ ఖజానాకు లాభం చేకూరినట్లే.
జనం ఖర్చు పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రజలు ఖర్చు పెట్టాలంటే వారికి ఉపాధి, ఆదాయం పెరిగితే ఆటోమెటిక్ గా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే సామాన్యులకు ఇస్తున్న సంక్షేమ పథకాలను వారు దాచుకోరు. వాటిని ఖర్చు పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీ మాత్రం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడటం చూస్తే కేవలం రాజకీయ కోణంలోనే ఆరోపణలు చేస్తున్నారనేది అందరికీ అర్థం అవుతుంది.