ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి. అధికారం దక్కించుకోవాలి. అందుకోసం ఎలాంటి హామీలైనా ఇద్దాం. వాటి అమలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్నది తర్వాత చూసుకుందాం.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్లును ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాస్తవ రాబడులు పరిగణలోకి తీసుకోకుండా పార్టీలు ఒకదానికి మించి మరొకటి హామీలు గుప్పిస్తున్నాయి. వీటి సాధ్యసాధ్యాలపై ప్రజలు కూడా ఆలోచించడం లేదు.


గతంలో బీఆర్ఎస్ అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో ఇబ్బంది పడుతోంది.  అయినా గత ఎన్నికల మ్యానిఫెస్టో ని మించి ఇప్పుడు ప్రకటించింది.  కర్ణాటక ఫలితాలు ఇచ్చిన జోష్ తో కాంగ్రెస్ తెలంగాణలో మంచి ఊపు మీద ఉంది. అక్కడ అమలు చేసిన ప్రణాళికనే ఇక్కడ చేసేందుకు యత్నిస్తోంది.  నాయకులు మధ్య ఐక్యత కుదిర్చి.. జనంలోకి సులభంగా వెళ్లిన ఆరు గ్యారెంటీలను ఇక్కడ కూడా ప్రకటించింది.  


కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై భారీగా వ్యతిరేకత ఉండటం.. కమీషన్ సర్కారు అని ప్రజల్లోకి వెళ్లడం కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. అయినా బీజేపీకి దాదాపు 36శాతం ఓట్లు వచ్చాయి. జేడీఎస్ ఓట్లను కాంగ్రెస్ భారీగా చీల్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వంపై అంత భారీగా వ్యతిరేకత లేకున్నా.. కాంగ్రెస్ కు పోటీగా తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది.


కాంగ్రెస్ విషయానికొస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు..  రూ.500 కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా రూ.15 వేలు, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు, రూ.4వేల చొప్పున నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500  తదితర హామీలు ప్రకటించింది. అయితే వీటి అమలుకు ఏడాదికి రూ.3.50 నుంచి రూ.4లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. మన రాష్ట్ర ఆదాయం చూసుకొని హామీలు ప్రకటించాలి. లేకుంటే ఇబ్బందుల పాలవుతాం.  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అలానే ఉన్నాయి. చూద్దాం ప్రజలు దేనికి ఆకర్షితులవుతారో..

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS