చంద్రబాబు నాయుడు అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు దేశంలో ఎక్కడా లేని సౌకర్యాలు కల్పించాలమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అందులో ముఖ్యంగా రాజమండ్రిలో ఆయనకు స్నేహ బ్లాక్ కేటాయించామని ఏ గదిలో ఉన్నది కూడా చాలా సీక్రెట్ గా ఉంచామని ఆయన భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేమని చెప్పుకొచ్చింది. ఆయనకు రోజు ఇంటి నుంచి వచ్చే భోజనానికి అనుమతి ఇచ్చామని తెలిపింది.


సెప్టెంబర్ 9 వ తారీఖు న అరెస్టు అయిన ఆయనకు అన్ని రకాల వీఐపీ సౌకర్యాలు కల్పించనట్లు తెలిపారు. అనంతరం ఆయన్ని సీఐడీ కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఆయన్ను రాజమండ్రి జైల్లోనే విచారించినట్లు పేర్కొన్నారు. అన్నింటికీ తెలియదు, గుర్తు లేదు, మరిచిపోయాను అని చంద్రబాబు చెప్పారు. అయితే జైల్లో ఎక్కువగా దోమలు ఉన్నాయని ఎల్లో మీడియా విష ప్రచారం చేసింది. అంతే కాకుండా ఆయన ఆరోగ్యానికి సంబంధించి విష ప్రచారం చేసిందని చెప్పుకొచ్చారు.


చర్మ సమస్యలు ఎక్కువగా అవుతున్నాయని విష ప్రచారం చేసింది. అయితే చంద్రబాబు బరువు తగ్గారని కూడా ఎల్లో మీడియా ప్రచారం చేయగా డాక్టర్లు వచ్చి ఆయన్ని పరీక్షించగా ఒక కిలో బరువు పెరిగారని చెప్పారు. జైలుకు వచ్చినపుడు 66 కిలోలు ఉంటే 67 కిలోలు అయ్యారని విడుదల సమయానికి ఆయన అరవై ఎడున్నర కిలోలు బరువు ఉన్నట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. అంటే ఆయన మొత్తం ఒకటిన్నర కిలోలు జైలుకు వచ్చిన తర్వాత పెరిగారని తెలిపారు.


చంద్రబాబు నాయుడుకు కంటి సంబంధ సమస్యలు ఉన్నప్పుడు ఆయనకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలపడంతో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఆయన తిరిగి నవంబర్ 28 న మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ కంటి సమస్య ఉందని చెప్పిన ఆయన బయటకు రాగానే మీడియాతో మాట్లాడటం చూస్తుంటే ఆయన ఆరోగ్యంపై అనుమానాలు కలగకమానడం లేదని వైసీపీ నేతలు ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: