
ఈ నిర్ణయంపై టీడీపీ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగా లేని ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయాని భావించింది. సుమారు 80 స్థానాల్లో పోటీ చేసినా.. ఒక్కో అసెంబ్లీ సీటుకు రూ.5కోట్లు చొప్పున ఖర్చు చేసినా రూ.400 కోట్లు.. ప్రచారానికి మరో రూ.400 కోట్లు ఇలా సుమారు రూ.1000 కోట్లు ఖర్చు అవుతాయని భావించింది. ఇంత ఖర్చు పెట్టి పోటీ చేస్తే 1-2 స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది.
భవిష్యత్తులో ఈ డబ్బులు ఏపీ ఎన్నికలకు ఉపయోగపడతాయి అని భావించి ఉండొచ్చు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆంధ్రాలో కాంట్రాక్టులు చేసే హెడ్ క్వార్టర్లు హైదరాబాద్ లోనే ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి సాయంతో వీరి వద్ద నుంచి కూడా కొంత పార్టీ ఫండ్ వసూలు చేయవచ్చు అని ఆలోచిస్తోంది. ఇదే క్రమంలో జగన్ కు డబ్బులు రాకుండా కూడా కొంత వరకు ఆపేయోచ్చు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పెరుగుతుంది. మనం తలచుకుంటే ఏదైనా సాధ్యమే అనే ఊపుతో ఏపీ ఎన్నికలకు వెళ్తారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టి ఏపీలో జనసేనతో కలిసి బీజేపీని కలుపుకొని వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పోటీ వచ్చేవారిని పక్కకు పెట్టారు. శత్రువులుగా అవతలి వాళ్లను చూస్తూ తద్వారా రాజకీయం అంతా తమ గుప్పిట్లోకి రావాలని చూస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా పోటీనుంచి తప్పుకున్నారు.