ఐటీ రంగంలో అలజడిని సృష్టించిన మూన్ లైటింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్ అయ్యాక మిగిలిన సమయంలో వేరొక కంపెనీలో ఉదయోగం చేస్తూ అదనపు ఆదాయం పొందేవారు. దీనిని ప్రారంభంలో కొన్ని కంపెనీలు షరతులపై అంగీకరించాయి.  అయితే దీనిని విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టెక్ కంపెనీలు వ్యతిరేకించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలువురిని ఉద్యోగాల నుంచి తీసేశాయి.


తాజాగా మూన్ లైటింగ్ పై మైక్రోసాఫ్ట్ మాజీ హెచ్ ఆర్ వైస్ ప్రెసిడెంట్  క్రిస్ విలయమ్స్ మరోలా స్పందించారు. రెండో ఉద్యోగం చేసుకోకుండా కంపెనీలు ఉద్యోగుల్ని ఆపకూడదన్నారు. ఉద్యోగుల జీవితాన్ని తమకే అంకితం చేయాలని పలు సంస్థలు కోరుకోకూడదని చెప్పారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.


దీనిపై ఆయన ఇంకా ఏమన్నారు అంటే.. మూన్ లైటింగ్ అనేది శ్రామిక రంగంలో ఓ భాగం. ఈ పని విధానంతో జీవితంలో అనేక విజయాలు సాధించిన గొప్ప గొప్ప వారున్నారు. మా అమ్మ  మమల్ని కళాశాలలో చేర్పించడానికి రెండు ఉద్యోగాలు చేసేది. సంస్థ కోసం ఉద్యోగులు ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని మేనేజర్లు ఆశించండం తప్పే అవుతుందని వెల్లడించారు. ఉద్యోగులు వారి సమయాన్ని సంస్థలకు మాత్రమే అంకితం చేయలేరు.


ఓ కంపెనీలో పనిచేసేటప్పుడు సదరు ఉద్యోగి మిగిలిన సమయంలో ఏం చేయాలో అతని ఇష్టం పై ఆధారపడి ఉంటుంది. సంస్థల్ని ఉద్దేశిస్తూ మీ నిర్ణయాన్ని వారి ఇష్టాల మీద రుద్దకూడదని చెప్పారు. అయితే తమ ప్రత్యర్థి సంస్థల్లో పనిచేస్తుంటే పరిమితులు విధించొచ్చు.  సంస్థల్లో ప్రొడక్టవిటీ తగ్గితే తగు చర్యలు తీసుకునే అధికారం యాజమాన్యానికి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేనేజర్లు అతిగా స్పందిస్తారు. దీనివల్ల సిబ్బంది ఉన్న ఫలంగా రాజీనామాలు చేసి బయటకు వెళ్తుంటారు. ఇలా కాకుండా మేనేజర్లు కింది స్థాయి ఉద్యోగులు సాధించిన విజయాలు గుర్తించి రెండో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తే వారే మూన్ లైటింగ్ కి దూరంగా ఉంటారు అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: