తెలంగాణలోను అలాంటి యుద్ధమే నడుస్తున్నా.. తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆంధ్రా పార్టీలు యత్నిస్తున్నాయి. ఆంధ్రా పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలు తెలంగాణలో తమ ప్రభావాన్ని చూపడానికి తహతహలాడుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా మరి ఈ పార్టీలే ఎన్నికల బరిలో ఉండొచ్చు కదా.. అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా పార్టీలకు చోటు లేదా అంటే..
ప్రస్తుతం తెలంగాణ బరిలో ఉన్న ఏకైక ఆంధ్రా పార్టీ జనసేన. అది కూడా బీజేపీ నుంచి వచ్చిన అనుకోని అవకాశం. షర్మిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి క్లియర్ గా చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో పోటీకి జగన్ వ్యతిరేకం. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం అని ప్రకటించారు. 2014లో ఓ ఎంపీ, మూడు ఎమ్మెల్యే టికెట్లు వచ్చినా కూడా వైసీపీ తెలంగాణ నుంచి తప్పుకుంది. 2018లో టీడీపీకి 2 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి. 2023 లో అసలు పోటీ చేయడం లేదు. పోటీ చేస్తేనే బలహీన పడ్డ పార్టీలు పోటీ చేయకపోతే అసలు ఉంటాయా అనేదే ప్రస్తుత ప్రశ్న.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి షర్మిళ దాదాపు 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో స్థానిక ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ఇంత చేసి కాంగ్రెస్ లో విలీనానికి సిద్ధపడ్డారు. చివరకు ఆ పార్టీకి మద్దతు ప్రకటించి సైలెంట్ గా ఉన్నారు. అందువల్ల ఆంధ్రాపార్టీలకు తెలంగాణలో చోటు లేదని చెప్పవచ్చు. కాకపోతే ఆయా పార్టీలకు అభిమానులు ఉంటారు. వాళ్ల ఆత్మసాక్షిగా ఏ పార్టీ నచ్చితే వారికి ఓటేస్తారు.