వాస్తవ పరిస్థితికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రచారానికి పొంతన ఉండలం లేదు. అయితే తాము చేసుకున్న పనులను చెప్పుకోలేని స్థితిలో జగన్ సర్కారు ఉండటం మైనస్ గా మారుతుంది. అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు సేవలందించారు. ఈ సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా అంటే సమాధానమే లేదు. కానీ ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్టేయండి అనేలా ఉండేది అప్పటి పరిస్థితి.
రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి క్యూ కడుతున్నాయంటూ ఎల్లో మీడియాలో ప్రచారం విపరీతంగా ఉండేది. కియా కంపెనీ కారు పూర్తి కాకముందే ఆ సంస్థకు సంబంధించిన కారును తీసుకువచ్చి దానిని ప్రభుత్వ గొప్పలా ప్రచారం చేసింది ఎల్లో మీడియా. అదే ఇప్పుడు జగన్ విషయానికొచ్చే సరికి పెట్టుబడులు రావడం లేదని.. ఉన్నవి కూడా వెళ్తున్నాయని వార్తలు రాస్తోంది.
అయితే ఏపీలో పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతున్నాయి. కానీ వాటిని అంగీకరించే స్థితిలో ఎల్లో మీడియా లేదు. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్పీసీఎల్ తో ఏపీ సర్కారు ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడులు సంబంధించి 500 మెగావాట్ల చొప్పున సౌర, పవన విద్యుత్తు ప్లాంట్లతో పాటు 250 మెగావాట్ల పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు తదితర ఏర్పాట్లు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అవేరా స్కూటర్ తయారీ సంస్థ రూ.100 కోట్ల విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కేంద్ర నిధులతో సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరోవైపు ఆగ్రో, ఆహార శుద్ధి, టెక్స్ టైల్, కెమికల్స్, ఆటోముబైల్, సేవా రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు అందుబాటులో రానున్నాయి.