ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ? ఇన్నాళ్లు ఈ ప్రశ్నకు సమాధానమే లేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులేస్తున్న జగన్ సర్కారు విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కోర్టు కేసులు ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లు జాప్యం జరిగినా డిసెంబరు 8 నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్ని పూర్తయ్యాయని.. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని చెబుతున్నా.. ఏక్కడో ఏదో అనుమానం అయితే వస్తోంది.


అమరావతి రాజధాని పేరుతో రైతుల భూముల్ని బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రూ. వేలకోట్లకు పెంచుకున్న బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు తమ సర్వ శక్తులు ఒడ్డి జగన్ ను విశాఖ రిషికొండ వెళ్లకుండా ఆపేందుకు యత్నిస్తున్నారు.  ఒకవేళ జగన్ సర్కారు గద్దె దిగితే తమ కు రూట్ క్లియర్ అవుతుందని వారు భావిస్తున్నారు. మరి అప్పటి వరకు..


ఒకవేళ జగన్ రిషికొండకు వెళ్తే పరిస్థితులు అన్నీ మారిపోతాయి. జూన్ నాటికి విభజన చట్టం పూర్తవుతుంది. ప్రస్తుత ఏపీ రాజధాని హైదరాబాద్. ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసినా అమరావతే ఏపీ రాజధాని ప్రకటిస్తే హైదరాబాద్ పై హక్కులు వదులుకోవాల్సి ఉంటుందని భావించి టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు కేంద్రంతో నోటిఫైడ్ చేపించలేదు. ఇప్పుడు జగన్ దీనిని ఆసరాగా తీసుకొని రిషికొండకు పరిపాలనను షిప్ట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం ప్రకటించి హోం శాఖ ద్వారా నోటిఫైడ్ చేపిస్తే దానిని మార్చడానికి అవకాశం ఉండదు.


అందుకే టీడీపీ నేతలు రిషికొండపై పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల కింద పిటిషన్లు దాఖలు చేపిస్తున్నారు. తాజాగా పర్యావరణ అంశం కూడా పక్కకు వెళ్లింది. ఆ పిటిషన్ కొట్టేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రిషికొండ తవ్వకాలపై మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని ఈ నెల 27కి వాయిదా వేశారు. ఈలోపు జగన్ వైజాగ్ వెళ్తే ఆయనకు తిరుగుండదు. లేకపోతే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: