సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభిస్తున్నాయి. అటు రాజకీయ పక్షాలు సైతం వ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. ఎలాగైనా చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి బలమైన ప్రయత్నం చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అందరి చూపు తెలగు రాష్ట్రంపై పడింది.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం ఏపీపై పడుతుందని ఆ పార్టీ అంచనాలు వేసుకుంటుంది. అయితే ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న వైసీపీ, టీడీపీలు ఉన్నాయి. ఇక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రభావం అంతంత మాత్రమే. ప్రస్తుతం జనసేన మాత్రమే ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉంది. వైసీపీ, టీడీపీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలో లేకపోవడం విశేషం. వైసీపీ బీజేపీతో స్నేహ భావం కొనసాగిస్తోంది. అటు టీడీపీ సైతం బీజేపీ స్నేహాన్ని కోరుకుంటుంది. బీజేపీ మాత్రం ప్రస్తుతానికి టీడీపీకి, వైసీపీకి సమ దూరం పాటిస్తోంది.


సరిగ్గా ఇదే సమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు. 2024 ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలపై కీలక సూచనలు అందించేందుకు సమ్మతించినట్లు వార్తలు వచ్చాయి. అయితే రాష్ట్ర స్థాయిలో గెలుపుతో పాటు జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ బిహార్ లో పార్టీ స్థాపించారు. అక్కడ నితీశ్ కుమార్ ను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పీకే బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే బీజేపీ దక్షిణాదిలో తన బలం పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని యోచిస్తోంది. దీంతో పాటు టీడీపీకి కూడా జాతీయ స్థాయిలో బీజేపీ మద్దతు కీలకం కాబట్టి చంద్రబాబు పీకేతో బీజేపీకి రాజకీయ రాయభారం పంపారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk