ఇది ఒకవేళ చంద్రబాబు దగ్గరికి చేరగలిగితే ఆయన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. దేశ విధానాల్లో కూడా మూర్ఖంగా ఆలోచించే వారు ఆయన చుట్టూ ఉండటం వల్ల పార్టీ నష్టపోతోంది. అయోధ్య రామాలయం అనేది 500 ఏళ్ల నాటి కల. దీనిని కేంద్రంలోని బీజేపీ సర్కారు అంగరంగ వైభవంగా నిర్వహించింది. నూతనంగా నిర్మించిన ఆలయంలోని బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని పలువురు కీలక నాయకులను ఆహ్వానించింది.
ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ని కూడా ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఆయన తన పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడితో కలసి ప్రత్యేక విమానంలో అయోధ్యకు తరలి వెళ్లారు. బీజేపీతో బంధాన్ని బలపరుచుకోవడంతో పాటు హిందువులకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా కొంతమంది పార్టీ కార్యకర్తల నిర్వాకం వల్ల టీడీపీ నష్టపోతుంది.
అయోధ్య రాములోరి ప్లేస్ లో ఎన్టీరామారావు ఫొటో పెట్టి దానిని అపహాస్యం చేస్తున్నారు. ఎవరెన్ని గుడులు కట్టినా మా రాముడివి నీవే.. మా తెలుగువారింట కొలువైన దైవం నీవే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఎన్టీఆర్ రాముని వేషధారణతో పాటు శ్రీకృష్ణుడి, దుర్యోధనుడి వేషం కూడా వేశారు. దేశం మొత్తం రామనామస్మరణ చేస్తున్న క్రమంలో వీరు ఇంకా పోస్టుల పెట్టి తమను తామే అపహాస్యం చేసుకుంటున్నారు. పార్టీ అధినేత రాములోరి భక్తిలో మమేకం అయితే పార్టీ కార్యకర్తలు మాత్రం ఇలాంటి పోస్టులు పెట్టి పార్టీ పరువును తీస్తున్నారని చంద్రబాబు ముందు వీరిని మార్చాలి పలువురు కోరుతున్నారు.