అయితే ఈ రామమందిర కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని..మరికొన్ని నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ రామమందిరాన్ని హడావుడిగా, నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించిదని విమర్శలు చేస్తున్నాయి. రామమందిరాన్ని ఇప్పుడే ఎందుకు ప్రారంభించిందనే అంశాన్ని పరిశీలిస్తే.. అసలు బీజేపీకి రామమందిరం ఓట్లు కురిపిస్తుందా లేదా అనేది ఎన్నికల తర్వాతే తేలనుంది.
అయితే అయోధ్యలో రామమందిరం నిర్మించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. దాదాపు 500 ఏళ్ల నుంచి ఉంది. అయితే దీనికోసం బీజేపీ గట్టిగా పోరాడింది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో దేశం మొత్తం రామ నామ స్మరణ మారు మోగింది. దీనికి బీజేపీ మోదీ నామాన్ని జత కలిపింది. నారాయణ మంత్రం లోని రా అనే అక్షరం.. నమఃశివాయలో ఉన్న మ అనే అక్షరం రెండూ కలిపితే రామనామం వచ్చింది. అందుకే ఇది అంత శక్తిమంతం. రామనామంతో దేన్ని జోడించినా అది అపవిత్రం అవుతుంది. కానీ ఈ విషయాన్ని విపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే 2024లోక్ సభ ఎన్నికల్లో రామమందిరాన్ని చూసి బీజేపీకి ఎక్కువ మంది హిందువులు ఓటు వేస్తారా అంటే కచ్చితంగా చెప్పలేకపోయినా.. మెజార్టీ ఓటర్లు మాత్రం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏదైనా ఒక అంశం దేశ ప్రజలందరినీ ఒక వైపు నడిపించే సమయంలో అది కచ్చితంగా రాజీకయంగా కలిసి వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అలా జరగకపోవచ్చు. 1992లో బాబ్రి మసీదు కూల్చివేత తర్వాత యూపీలో బీజేపీ భారీ మోజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంతా భావించారు. కానీ కాన్షీరాం, ములాయం సింగ్ జత కట్టడంతో బీజేపీకి అధికారం దక్కలేదు. మరి రామమందిరం బీజేపీకి ఏ మేర లబ్ధి చేకూరుస్తుందో చూడాలి.