ఒక అద్భుత దౌత్య విజయంగా దీనిని అభివర్ణించాలి. కఠిన చట్టాలకు కేరాఫ్ అయిన ఖతార్ లో మోదీ సర్కారు సాధించిన అద్భుత విజయంగా దీనిని వర్ణించాలి. గూఢాచార్యం ఆరోపణలపై అరెస్టు అయిన ఎనిమిది మంది భారతీయులు(మాజీ నేవీ ఉద్యోగులు)ను ఖతార్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దాదాపు 18 నెలలుగా వీరు ఖతార్ జైల్లో ఖైదీలుగా ఉన్నారు.


వీరికి విధించిన మరణ శిక్షను కూడా ఇప్పటికే అక్కడి కోర్టులు జైలు శిక్షగా మార్చగా.. తాజాగా దాని నుంచి విముక్తి కల్పించి భారత్ కు అప్పగించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎనిమిది మందిలో ఏడుగురు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఖతారు తీసుకున్న నిర్ణయాన్ని మేం అభినందిస్తున్నాం అని విదేశాంక శాఖ పేర్కొంది.


తాజా పరిణామం భారత ప్రభుత్వం సాధించిన అద్భుత దౌత్య విజయంగా చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా ప్రధాని నరేంద్ర మోదీకే చెందుతుంది. గూఢాచార్యం ఆరోపణలు కింద ఎనిమిద మంది భారత నౌకా దళ మాజీ సిబ్బందిని 2022లో ఖతాలు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేవలం రెండు మూడు సార్లు విచారణ జరపిన ప్రాథమిక కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. దీన్ని రద్దు చేయించేందుకు మోదీ సర్కారు దౌత్య పరంగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేసింది.


మొత్తానికి విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారు భారత్ కు చేరుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. అవేమీ బయటకు పొక్క నీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా దౌత్య పరంగా భారత్ ఘన విజాయాన్ని సాధించింది అనే చెప్పాలి. అయితే ఇదంతా కూడా నిరంతర ప్రయత్నాలు.. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రత్యేక చొరవతోనే సాధ్యమైందని చెబుతున్నారు. ఈ మాటలను చెబుతోంది ఎవరో కాదు. దిల్లీకి చేరుకున్న మాజీ నేవీ అధికారులు. మోదీ వ్యక్తిగత జోక్యం లేకుంటే ఇది సాధ్యం అయ్యేది కాదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇలా విడుదలైన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఒకరు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: