ఇవే నాకు చివరి ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్  భవిష్యత్తు దృష్ట్యా నేను ముఖ్యమంత్రి కావడం అత్యవసరం. ఇప్పటికే అన్ని రంగాల్లో ఏపీ నష్టపోయింది. చివరకు రోడ్లు వేసే పరిస్థితి కూడా లేదు. ఆర్థిక అభివృద్ధి మాట దేవుడెరుగు.. సమీప భవిష్యత్తులో బాగు పడుతుందని గ్యారెంటీ లేదు ఇవీ ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత చంద్రబాబు తన అంతరంగికులతో అన్న మాటలు అని ఓ మీడియా రాసుకొచ్చిన కథనం.


టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ  చేర్చుకోవాలని చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. ఎట్టకేలకు అమిత్ షా చంద్రబాబుని చర్చలకు పిలవడంతో అంతా సవ్యంగానే జరుగుతుందని అందరూ భావించారు. కానీ దిల్లీ లో అమిత్ షా ను కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ సమావేశం ఊసే ఎవరూ ఎత్తడం లేదు. దీంతో పొత్తు ఏమైంది. అమిత్ షా పెట్టిన షరతులు ఏంటి అని చెవులు కొరుక్కొంటున్నారు.


పొత్తుకు అమిత్ షా సిద్ధం అయినా ఏవో షరతులు విధించినట్లు తెలుస్తోంది. దీనిపై రోజుకో వార్త వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చంద్రబాబు తో అమిత్ షా చర్చించింది ఇవే అంటూ ఓ మీడియా కథనం రాసుకొచ్చింది.  బీజేపీ తమకు 60 స్థానాలు అడిగిందని పేర్కొంది. అంటే జనసేన బీజేపీ కూటమికి కలిపి 60 స్థానాలు.. ఇందులో బీజేపీకి 5, జనసేనకు 55… అలాగే పది పార్లమెంట్ స్థానాలు ఇందులో బీజేపీకి ఎనిమిది, జనసేనకు రెండు స్థానాలు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి.


దీంతో పాటు మరో ముఖ్య షరతు కూడా విధించింది. అది ఏంటంటే పవన్ కల్యాణ్ ను ఏడాదిన్నర పాటు సీఎంగా ప్రకటించాలి. వీటికి ఒప్పుకుంటే ఎన్డీయేలో భాగస్వామి పక్షంగా టీడీపీని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. అందుకే చంద్రబాబు ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారని పేర్కొంది. మరి దీనిపై చంద్రబాబు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: