కానీ ఆయన పక్కా లెక్కలతోనే ఈ సారి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు అనిపిస్తోంది. తన సన్నిహితులతో చంద్రబాబు చెప్పే లెక్కేంటంటే.. గత ఎన్నికల్లో పది శాతం ఓట్ల వ్యత్యాసం అధికార వైసీపీకి, టీడీపీకి ఉంది. మనం తప్పకుండా 140-150 సీట్లలో పోటీ చేస్తాం. 100కి తగ్గకుండా మనం విజయం సాధించాలి. 2014లో ఇదే జరిగింది. కూటమితో కలసి వెళ్లినా 102 స్థానాల్లో గెలుపొందాం. అందుకే ప్రభుత్వాన్ని ఎవరి పై ఆధారపడకుండా నడిపించగలిగాం. ఇప్పుడు కూడా అలాగే విజయం సాధించాలి. 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన ఎలాగూ గెలవలేదనే ఉద్దేశంతో ఆ పార్టీ కార్యకర్తలు మూడు శాతం మంది వైసీపీకి ఓటేశారు.
ఇప్పుడు జట్టు మూలంగా వీరంతా మన వైపునకు వచ్చేస్తారు. అలాగే బీజేపీ ఓటు బ్యాంకు కూడా గతంలో వైసీపీకి మళ్లింది. ప్రస్తుతం వీరంతా మన కూటమిని ఆదరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీరి ఓట్లు శాతం కూడా 3-5శాతం వరకు ఉంటుంది. తటస్థులు 2శాతం ఉన్నా మొత్తం పది శాతం వరకు మనకు ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నారు. జనసేనకు గతంలో ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఈ సారి కనీసం మూడు శాతం మనవైపు మళ్లినా అంతిమ విజయం మనదే అని చెబుతున్నారు. ఈ లెక్కల వల్లే మనకి పొత్తులు అనివార్యం అని తన సన్నిహితులతో చెబుతున్నారు. చూద్దాం మరి ఈ లెక్కలు విజయవంతం అవుతాయే లేదో?