మధ్యాహ్నం సూర్యుడిలా ఒక వెలుగు వెలిగిన కేసీఆర్ ఒక్కసారిగా మబ్బుల చాటుకి కనుమరుగు అయిపోయాడు. ఇప్పుడు ఆయన గ్రాఫ్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయినా ప్రజల్లో పెద్దగా సానుభూతి కలగడం లేదు.  దీనికి సాక్ష్యం. . త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని దేశంలో అత్యంత శక్తిమంతమైన వందమంది భారతీయుల జాబితాను ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకటించింది.


ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు, క్రీడాకారులు ఉన్నారు. ఈ జాబితాలో  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చోటు దక్కడం విశేషం. కానీ మాజీ సీఎం కేసీఆర్ టాప్-100లో లేకపోవడం ఆయన గ్రాఫ్ క్రమంగా పడిపోతుందని చెప్పడానికి నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డికి 39వ స్థానం దక్కగా… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి 56వ ప్లేస్ దక్కింది.


మొత్తంగా చూసుకుంటే నరేంద్ర మోదీ మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండో స్థానం దక్కించుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ మూడో స్థానం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ నాలుగో స్థానం, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ ఐదో స్థానం, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆరోస్థానం, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఏడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనిమిది, జేపీ నడ్డా తొమ్మిది, గౌతం అదానీ పదో స్థానంలో ఉన్నారు.


ఈ జాబితాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 16వ స్థానం దక్కింది. ఏఐసీసీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీకి 29వ స్థానం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 36 , రేవంత్ రెడ్డి 39వ స్థానాల్లో ఉన్నారు.  ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి 38 వ ప్లేస్ లో ఉండగా.. కెప్టెక్ కూల్ ఎంఎస్ ధోని కి 58వ స్థానం దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: