వెలిగొండ ప్రాక్టులో అత్యంత కీలకమైన జంట సొరంగాలను పూర్తి చేసిన సీఎం జగన్ ఇటీవల వాటిని జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం, నెల్లూరు వైఎస్సార్ జిల్లాల్లోని దుర్భిక్ష ప్రాంత రైతుల కల సాకారం అవుతుంది. అయితే దీని వెనుక ఉన్న పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే..


శ్రీశైలం ఉన్న నల్లమల పర్వతాలు మేఘాలను రాకుండా ఆపడం వల్ల ప్రకాశం తో పాటు కొంత నెల్లూరు కరువు ప్రాంతంగా మిగిలిపోయింది. అసలు ఆంధ్రాలో అందరికంటే ముందు ఆహారం లేక వలసలతో పాటు తిండిలేక బక్కచిక్కింది ప్రకాశం జిల్లా. అక్కడ అనేక గ్రామాల్లో వృద్ధులు తప్ప యువతరం కనిపించదు. ఉపాధి కోసం వలస వెళ్లిన వారిని అక్కడ మనం గమనించవచ్చు. శ్రీశైలం నుంచి వాటర్ తీసుకునేందుకు కొండలు అడ్డుగా ఉంటాయి. అందుకోసమే టన్నెల్ లు తవ్వి నీటిని సరఫరా చేసేందుకు ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు కు 1996 లో చంద్రబాబు శంకుస్థాపన చేశారు.


ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు. 2005లో తిరిగి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. అది 2024లో ఇప్పటికీ పూర్తి అయింది. అయినా ఇంకా నీళ్లు రాలేదు. రెండు టన్నెల్లు తవ్వడానికి 28 ఏళ్లు పట్టింది.  అత్యంత కరవు ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి ఇంత సమయం పట్టడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. చైనా వాడు అయితే రెండేళ్లలో కట్టి ఉండేవాడు. మనకి మహా అయితే మరో నాలుగేళ్లు అదనంగా పట్టాలి.


కానీ రెండు దశాబ్దాలు పట్టడమే విడ్డూరంగా ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు బలమైన వారు కావడంతో ఎక్కడికక్కడ నిధులు రాకుండా అడ్డుకున్నారు. ఫలితం ప్రాజెక్టు పనులు ఆలస్యం అయ్యారు. కరవు పెరిగింది. అమరావతి రాజధాని అంటే ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఇదే. రెండు జిల్లాల కోసమే పోలవరం, పులిచింతల, రాజధాని ఇస్తే మిగతా జిల్లాల వారి పరిస్థితి ఏంటి. అందుకే ఇక్కడి వారు రాజధాని ఉద్యమాన్ని వ్యతిరేకించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: