ఇటీవల అకాల వర్షాలు తెలంగాణ రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. తరచూ వచ్చే వర్షాలు పంటలను పాడు చేస్తున్నాయి. అయితే.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు వెల్లడించారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్దితో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. పదేళ్ల పాటు అస్తవ్యస్త విధానాలు పరిపాలనతో రైతులను ఆగమ్య గోచరంగా చేశారన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు.. ఇప్పుడు రైతుల కోసమే పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై కొందరు అనవసర విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. పదేళ్లకాలంలో ఏనాడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వని వాళ్లు ఇవాళ విడ్డూరంగా మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఆక్షేపించారు.


కేవలం ఎన్నికలకు ముందు 150 కోట్లు మాత్రమే పరిహారంగా ఇచ్చారని రెండో మారు జీవో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఆరోపించారు. మూడోమారు కనీసం పంట నష్టాన్ని కూడా అంచనా వేయలేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు దుయ్యబట్టారు. గత మే నెల వరకు కూడా రైతుబంధు నిధులు జమ చేసిన నేతలు ఇవాళ మమ్మల్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.


మొదటి విడత చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు.. రెండో విడత రుణమాఫీకి ఔటర్ రింగ్ రోడ్డును కుదవ పెట్టి 7వేల కోట్లు మాత్రమే ఇచ్చి మరో 13 వేల కోట్లు బకాయిలు పెట్టారని విమర్శించారు. నాగార్జునసాగర్ కింద మొదటి పంటకే నీరు ఇవ్వని నేతలు ఇవాళ రెండో పంటకు నీరు ఇవ్వలేదని మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr