ఈ సర్వే ఫలితాలను బట్టి చూస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం నియోజక వర్గాల్లో ఏ పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఏ నియోజక వర్గంలో టఫ్ ఫైట్ ఉందనే విషయం కూడా ఈ సర్వే చెప్పింది. దీన్ని బట్టి చూస్తే మొత్తం 175 నియోజక వర్గాల్లో వైసీపీ 109 స్థానాలు కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ఈ రేస్ సర్వే చెబుతోంది. ఇక కూటమి విషయానికి వస్తే దాదాపు 32 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఇండియా హెరాల్డ్‌కు అందని సమాచారం.
మిగిలిన 34 చోట్ల మాత్రం టఫ్ ఫైటింగ్ ఉందని ఈ రేస్ సంస్థ వెల్లడించింది. అలాగే పోలింగ్ పర్సంటేజ్‌ను కూడా ఈ రేస్ సర్వే సంస్థ అంచనా వేసింది. దీని ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. వైసీపీకి 48.3 శాతం వరకూ ఓటింగ్ ఉంటుందట. అలాగే కూటమికి 44.8 వరకూ ఓటంగ్ శాతం ఉంటుందట. మరో 4.9 శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారట. దీన్ని బట్టి చూస్తే వైసీపీ, కూటమి మధ్య ఓట్ల శాతంలో నాలుగు నుంచి ఐదు శాతం వరకూ తేడా ఉండొచ్చని ఇండియా హెరాల్డ్ భావిస్తోంది. మరి ఈ సంచలనాల సర్వే ఫలితాలు ఎంత వరకూ నిజం అవుతాయో ఎన్నికల తర్వాత కానీ తెలియదు.