ఇప్పటి వరకూ అనేక జాతీయ సంస్థలు తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ వచ్చాయి. కూటమి ఏర్పడే ముందు వరకూ అనేక జాతీయ సర్వే సంస్థలు వైసీపీదే విజయం అంటూ చెబుతూ వచ్చాయి. అయితే కొన్ని రోజులాగా వస్తున్నా చాలా సర్వేలు కూటమిదే ఏపీలో అధికారం అని చెబుతూ వస్తున్నాయి. ఇక తాజాగా సర్వే ఫలితాలు విడుదల చేసిన రేస్ సంస్థ మాత్రం వైసీపీ విజయఢంకా మోగించబోతోందని తేల్చి చెప్పింది.

 
ఏపీలో మొత్తం 175 నియోజక వర్గాలు ఉన్నాయి. వీటిలో వైసీపీ 109 స్థానాలు కచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ఈ రేస్‌ సర్వే చెప్పింది. కూటమి విషయానికి వస్తే దాదాపు 32 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందట. పార్లమెంట్‌ విషయానికి వస్తే.. మొత్తం ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో వైసీపీ ఏకంగా 20 స్థానాల్లో కచ్చితంగా విజయ ఢంకా మోగించబోతోందట. ఇక కూటమి రెండు స్థానాల్లో కచ్చితంగా గెలవబోతోందట.


టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీ చేసే స్థానాల్లో గుంటూరు, అమలాపురం స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం కనిపిస్తోందట. మరో మూడు స్థానాల్లో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోందట. ఆ మూడు స్థానాలు ఏమిటంటే.. విశాఖ పట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం. ఈ ఐదు కాకుండా మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగించడం ఖాయం అని రేస్ సర్వే సంస్థ చెబుతోంది.


సర్వే ఫలితాలు చూస్తే.. గత ఎంపీ ఎన్నికల ఫలితాలను వైసీపీ మరోసారి రిపీట్‌ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 22 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ కేవలం మూడు సీట్లే గెలిచింది. ఇప్పుడు కూడా 20 సీట్లు ఖాయం అని ఈ సర్వే చెబుతుంటే.. మరో మూడు చోట్ల టైట్‌ ఫైట్‌ ఉంది కాబట్టి అక్కడా ఒకటో, రెండో గెలవచ్చు. అంటే సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతుందా?


మరింత సమాచారం తెలుసుకోండి: