వడ్డించే వాడు మన వాడు అయితే బంతి చివర కూర్చున్న విందు భోజనం అందుతునేది సామెత. ఇప్పుడు ఇది ఎందుకు అంటే.. బీసీలకు మేమే న్యాయం చేశాం.. మాతోనే వారికి సమ ప్రాధాన్యం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కన్నా సీఎం జగన్ బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చారు.


గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ సోషల్ ఇంజినీరింగ్ కు బ్రాండ్ అంబాసిడార్ గా సీట్లు ప్రకటించారు. మొత్తం ఈ వర్గాలకు 50 శాతం సీట్లు కేటాయించారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో 100 స్థానాల్లో 84 ఎమ్మెల్యే, 16 మందిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాల వారిని ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సామాజిక వర్గానికి చెందిన సీఎంలు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంతటి ప్రాధాన్యం లభించలేదు.


సాధారణంగా బీసీలకు ప్రత్యేకంగా సీట్లు అంటూ ఏమీ ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉంటుంది కానీ.. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో బీసీలకు రిజర్వేషన్లు ఉండవు. ఇలా ఉండని చోట కూడా బీసీలకు సీట్లు ప్రకటించడమే ఇక్కడ కీలకాంశం. ఇది జగన్ కే సాధ్యం అయిందని పలువురు పేర్కొంటున్నారు. వైసీపీ ఇప్పటి వరకు 48 ఎమ్మెల్యే సీట్లను బీసీలకు కేటాయించింది. బీసీల పార్టీగా చెప్పుకునే చంద్రబాబు ఇచ్చిన సీట్లు 31 దాని మిత్రపక్షం జనసేనను కలుపుకుంటే ఈ సంఖ్య 33కి చేరుతుంది.


పార్లమెంట్ స్థానాల విషయానికొస్తే దాదాపుగా 11స్థానాలను బీసీలకు జగన్ కేటాయిస్తే.. టీడీపీ మాత్రం నాలుగు స్థానాలకు పరిమితం చేసింది.  ఇది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. బీసీల కోసమే పుట్టిన పార్టీగా చెప్పుకునే చంద్రబాబు మరి ఇంత తక్కువ స్థాయిలో సీట్లు కేటాయించి వారికి ఏం సమాధానం చెబుతారో చూడాలి. మరోవైపు రేపటి ఎన్నికల్లో ఈ అంశాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది. మరి దీనిని టీడీపీ ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: