అమెరికాను ప్రపంచ పోలీసు అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ దేశానికి ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు కావాలి. తనది కానిది కూడా తన సొంతమే అనుకునే వైఖరి అమెరికాది. తాము వందల ఏళ్లుగా ప్రజాస్వామ్య దేశంగా ఉన్నామని గొప్పలు చెప్పుకునే అగ్రరాజ్యం ప్రజాస్వామ్య లక్షణాల గురించి తెలియదా అని పలు దేశాల ప్రతినిధులు ప్రశ్నిస్తూనే ఉంటారు.
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉంది. సర్వ సత్తాక స్వతంత్ర దేశం. తన దేశానికి ఏమీ కావాలో ఏమీ వద్దో భారత్ స్వయంగా నిర్ణయించుకోగలదు. అలాంటి భారత్ మీద పెత్తనం చేయాలని అమెరికా చూస్తోంది. ఇటీవల భారత్ పౌరసత్వ బిల్లును సవరించి.. దానిని అమలులోకి తెచ్చింది. దాని మీద కూడా అమెరికా విమర్శలు చేసింది. దీనికి భారత్ ధీటైన బదులు ఇచ్చింది. అది చాలదు అన్నట్లు ఇప్పుడు దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో అమెరికా పనిగట్టుకొని జోక్యం చేసుకుంటుంది.
కేజ్రీవాల్ అరెస్ట్ విషయమై పని గట్టుకొని జోక్యం చేసుకుంటోంది. కేజ్రీవాల్ అరెస్ట్ పై తన స్పందన తెలియజేస్తూ ఈ వ్యవహారంలో పారదర్శకత విచారణను ప్రోత్సహిస్తామని పేర్కొంది. అరెస్ట్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అయితే ఈ కేసు చూసేది ఈడీ. కేజ్రీవాల్ భారత పౌరుడు. భారత చట్టాల ప్రకారమేఆయన అరెస్ట్ జరిగింది. విచారణ సాగుతోంది. ఈ విషయంలో అమెరికా జోక్యం ఎందుకు అనేది పలువురి వాదన.
ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ పన్ను నోటీసులు ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై భారత చట్టాల ప్రాకరం విచారణ జరుగుతోంది. దీనిపై కూడా కాంగ్రెస్ బ్యాంకు అకౌంట్ల ఫ్రీజింగ్ ను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అయితే ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్ అకౌంట్లనే ఫ్రీజ్ చేసిన ఘనత అమెరికాది. కానీ వీటి గురించి మాట్లాడకుండా మన దేశ వ్యవహారాల్లో వేలు పెడుతూ ఉంటుంది.