ఇక పాత సచివాలయానికి వాస్తు దోషం ఉందనే సాకుతో రూ.1000 కోట్లతో కొత్త సచివాలయమే కట్టించారు. ఇది అంత సులభంగా ఏమీ జరగలేదు. తెలంగాణలో ఉన్న సెక్రటేరియట్ కి వాస్తు దోషం ఉందని రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ప్రచారం ఉంది. ప్రస్తుతం ప్రగతి భవన్ పక్కన దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు.
గతంలో పాత సెక్రటేరియట్ ఉన్నా.. ఇది నిర్మించిన తర్వాత వాస్తు దోషంతోనే రాజశేఖర్ రెడ్డి చనిపోయారనే ప్రచారం ఉంది. అందుకే ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య అందులో ఉండేందుకు ఇష్ట పడలేదు. ఇంట్లో ఉంటూ.. కేవలం అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసేందుకు మాత్రమే దానిని ఉపయోగించేవారు. దీనిలో లోపాలు ఉన్నాయంటూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ లో వాస్తు దోషం ఉందని.. అందుకే నిత్య సంఘర్షణలు, తెలంగాణ, ఆంధ్రా మధ్య వివాదాలు సాగుతున్నాయని చంద్రబాబు తర్వాత బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్ తో భవనాలు కేటాయింపు జరుపుకొని పాత సచివాలయాన్ని కూల్చేయించారు.
దానిలో అడుగు కూడా పెట్టకుండా ఇంటి నుంచే పరిపాలన సాగించారు. కొత్త సెక్రటేరియట్ కట్టిన తర్వాత ఆయనే ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా సెక్రటేరియట్ లో తన జాతకం ప్రకారం ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా.. లేక దాని నుంచే పాలన సాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.