ఏపీ అప్పుల గురించి ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది.  దీనిపై పలుమార్లు పలువురు రాజకీయ నేతలు ఎవరికి నచ్చిన వారు.. తమ నోటికి ఎంత అమౌంట్ వస్తే అంత అనేస్తుంటారు. తద్వారా ప్రభుత్వంపై బురదజల్లి.. ప్రజల్లో ఒక రకమైన భావనను తీసుకువచ్చి ఇదంతా నిజమే అని నమ్మిస్తుంటారు. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదంటూ చంద్రబాబు సీఎం జగన్ పై వ్యంగస్త్రాలు సంధిస్తున్నారు. అయితే అప్పుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి ఉందా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.


రాష్ట్ర విభజన సమయానికి ఉమ్మడి ఏపీ అప్పు రూ.లక్షా 66 వేల కోట్లు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఖాతాలో రూ.69 వేల కోట్లు, ఏపీ ఖాతాలో రూ.97 వేల కోట్లుగా అప్పుని విభజించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎడాపెడా అప్పులు చేసేశారు. ఇప్పుడు వాటిని వైసీపీ ప్రభుత్వం తీరుస్తూ వస్తోంది. అయితే నవరత్నాలు పథకాలు అమలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు  అంతంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పింది రూ.4.50లక్షల కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే లెక్కలు చెబుతోంది.


కానీ టీడీపీ మాత్రం రూ.14లక్షల కోట్లు అని దుష్ర్పచారం చేస్తున్నారు. వీరికి ఎల్లో మీడియా తోడైంది.  రాష్ట్రం అప్పుల మయం.. ఏపీ బాగుపడాలంటే నేనే అధికారంలోకి రావాలి అని కొత్త రాగాన్ని అందుకున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ద్వారా కూడా చెప్పిస్తున్నారు.


ఇలాంటివి అడ్డగోలు ఆరోపణలు మన దగ్గర సాధ్యం అవుతాయి కానీ అమెరికా లాంటి అగ్రదేశంలో సాధ్యం కావు. ఇంతకీ అమెరికాకి ఏపీకి లింక్ ఏంటంటే.. ఇది అగ్రరాజ్యం అని మనందరికీ తెలిసిందే.  ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. కానీ విచిత్ర మేమిటంటే. అప్పుల్లో కూడా అదే నంబర్ వన్. మొత్తం బడ్జెట్ లో ఆ దేశం 12శాతం అప్పులు చేస్తోంది. కానీ ఏపీలోనే అప్పులు చేస్తున్నట్లు.. మరెక్కడా లేనట్లు చంద్రబాబు అండ్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: