దాంతో కేంద్రంలో ఎవరికీ అధికారం దక్కుతుంది అన్నది చర్చగా మారింది. ఎవరికీ మెజార్టీ రాకపోవచ్చు అనే కొత్త చర్చ కూడా సాగుతుంది. కేంద్రంలో చూస్తే ఈ సారి మోదీ వేవ్ కూడా పెద్దగా లేదు అనే ప్రచారం ఊపందుకుంది. మోదీకి మూడో సారి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ లేదనే అంటున్నారు. అలాంటి ప్రచారం ఎందుకు సాగుతుందో మాత్రం అర్థం కావడం లేదు.
ఈ తరుణంలో మొన్నటి వరకు 400 సీట్లు అంటూ ఊదరగొట్టిన బీజేపీ అగ్రనేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లు ఐదుగురు ప్రధానులు ఉంటారు అని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. తద్వారా తమ ప్రభుత్వం వస్తే సుస్థిరంగా ఉంటుందని.. కూటమి వస్తే అల్లకల్లోలం అవుతుందని.. నాయకత్వం స్థిరంగా ఉండదనే భావన ఓటర్లలో కల్పించాలని చూస్తోంది.
మొత్తానికి ఇది ఎన్డీయే కూటమికి మంచి చేస్తుందా లేదా అనే విషయాలు చూస్తే.. గతంలో కాంగ్రెస్ హయాంలోని సంకీర్ణ ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేశాయి. ఐదేళ్ల పాటు ప్రధానిని మార్చకుండా చేశాయి. పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానులు సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన వారే. ఇక బీజేపీ హయాంలోని ప్రభుత్వమే సంకీర్ణాన్ని నడపలేక ముగ్గురు ప్రధానులను మార్చింది. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే సీఎంలను మార్చుతున్నారు తప్ప కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంల మార్పులు జరగలేదు. కర్ణాటక, ఉత్తరాఖండ్, గుజరాత్ ఇలా పలుచోట్ల బీజేపీ సీఎంలను మార్చింది. మొత్తం మీద కూటమిపై పై చేయి సాధించేందుకు బీజేపీ నేతలు వేస్తున్న ఎత్తుగడే ఐదేళ్లు ఐదుగురు ప్రధానుల అంశం. మరి ఏం జరుగుతుందో చూడాలి.