ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఉండటంతో రాజకీయం రంజుగా సాగుతోంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మాత్రమే సాగుతుండటంతో జాతీయ అంశాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఏపీలో మాత్రం రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన విషయాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి.


జగన్ తో వ్యక్తిగత విభేదాల కారణంగానే షర్మిళ కాంగ్రెస్ లో చేరారనే వాదన ఉంది. అయితే షర్మిళను కాంగ్రెస్ లోకి పంపిందే టీటీపీ అధినేత చంద్రబాబు అని..తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఆయన ఈ పని చేశారని జగన్ బాంబ్ పేల్చారు. అయితే రేవంత్ రెడ్డి పక్కా చంద్రబాబు మనిషే అన్నది జగన్ గట్టి నమ్మకం. తాను విశ్వసించని వారిని ఏపీ సీఎం అస్సలు దగ్గరకి రానివ్వరు. ఇక ఎన్నికల ప్రచారంలో తన చెల్లి షర్మిళ తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగుతుండటంతో మొత్తంగా ఆమె రాజకీయ నేపథ్యాన్నే ప్రశ్నిస్తున్నారు.


వాస్తవానికి గతంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే అయినా.. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు. ఈయన చెప్పినట్లు అధిష్ఠానం వింటుందా అంటే కచ్చితంగా కాదు.  తెలంగాణలోనే తన మనుషులకు రేవంత్ సీట్లు ఇప్పించుకోలేకపోయారు. అలాంటిది అధిష్ఠానం ఏపీలో ఆయన మాట వింటుందా. మరోవైపు చంద్ర బాబు ఎన్డీయే కూటమిలో ఉన్నారు.  తమ ప్రత్యర్థికి లాభం చేకూర్చేలా ఆ పార్టీ వ్యవహరిస్తుందా?


మరోవైపు షర్మిళ సైతం తన అన్న జగన్ ని విమర్శించినట్లు.. చంద్రబాబుని, బీజేపీని విమర్శించడం లేదు. అధికార పార్టీ కాబట్టి వైసీపీపై ఎక్కువగా ఫోకస్ చేయడం సహజం. పైగా షర్మిళది రాజకీయం కాదు. వ్యక్తిగత అంశాల్లో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇంకాస్తా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది తనకు మైనస్ గా జగన్ భావిస్తున్నారు. అందుకే డైవర్ట్ పాలిటిక్స్ కి తెర లేపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: