చంద్రబాబు.. ఆగర్భశ్రీమంతుడేమీ కాదు.. పెద్దగా ఆకట్టుకునే రూపం కాదు.. ఆకట్టుకునేలా ప్రసంగాలూ చేయలేరు.. ఆయన ఆత్మీయంగా పలకరించినా.. అదేదో తెచ్చిపెట్టుకున్నట్టుగా అనిపిస్తుందే తప్ప.. సహజంగా ఉండదు.. ఇలాంటి మైనస్‌లో చంద్రబాబులో ఎన్నో.. కానీ ప్రతికూలతలను మించిన సుగుణాలు చంద్రబాబులో ఎన్నో.. అవే ఆయన్ను రియల్‌ లీడర్‌ను చేశాయి. అవే ఆయనకు దాదాపు 45ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితం ప్రసాదించాయి.


చంద్రబాబులోని ఐదు ప్రధానమైన లక్షణాలు ఆయన్ను విజయవంతమైన రాజకీయ నాయకుడిని చేశాయి. అందులో మొట్టమొదటిది కష్టించే తత్వం.. ఈ విషయంలో చంద్రబాబుతో పోటీకి వచ్చే రాజకీయ నాయకుడు దేశంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ బిజీగా ఉంటారు. కానీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా నిత్యం బిజీగా ఉండటం చంద్రబాబు పనితీరు. పార్టీ కార్యక్రమాలు, ప్రజాసమస్యలపై పోరాటం.. ఇలా నిత్యం ఆయన బిజీగానే ఉంటారు. ఆయన విశ్రాంతి తీసుకోవడం.. రోజుల తరబడి కనిపించకుండా పోవడం అంటూ ఉండదు.


చంద్రబాబులోని మరో అద్భుతమైన లక్ష్యం. వ్యూహ చతురత. రాజకీయంగా వ్యూహాలు పన్నడంలో.. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఆయన దిట్ట. ఆ లక్షణమే ఆయన్ను విజయవంతమైన నాయకుడిగా తీర్చిదిద్దింది. చిన్న వయస్సులోనే దిల్లీ స్థాయిలో చక్రం తిప్పేలా చేసింది. ఆయన గొప్ప సమన్వయకర్త. సమూహాలను ఏకం చేయడం, కలిపి ఉంచడం, సమన్వయపరచడంలో చంద్రబాబును మించిన వారు లేరనే చెప్పాలి.


చంద్రబాబులో మరో ఉన్నతమైన గుణం.. అభివృద్ధి మంత్రం. రొటీన్‌ పాలనాపద్దతులతో కాకుండా అభివృద్ధి వేగంగా జరిగేలా చూడటం చంద్రబాబు లక్షణం. అందుకు ఆయన ఎన్నో వ్యూహాలు రచించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పాలనా సంస్కరణలు తెచ్చారు. ముందు చూపుతో ఐటీ వంటి టెక్నాలజీ రంగాలను ప్రోత్సహించారు. పీపీపీ వంటి పద్దతులతో కొత్త ప్రాజెక్టులు చేపట్టారు. పరిశ్రమలు తెచ్చి ఉపాధి పెరిగేలా చూశారు. ఇలా చంద్రబాబు అంటే అభివృద్ధికి మారుపేరు అనిపించారు.


కాలానుగుణంగా నిర్ణయాలు మార్చుకోవడం, మంచి ఎక్కడున్నా గుర్తించి ప్రోత్సహించడం, మంచిని స్వీకరించడం కూడా చంద్రబాబు ప్లస్‌ పాయింట్స్‌ గా చెప్పుకోవచ్చు. బీజేపీతో విడిపోయినా.. మళ్లీ జత కట్టినా.. జనసేనతో పొత్తు కట్టినా.. అన్నీ కాలానుగుణంగా తీసుకున్న నిర్ణయాలే. అవే చంద్రబాబును నిలబెట్టాయి. నిత్యం ప్రజలతోనే ఉండటం, యువ నేతలను ప్రోత్సహించడం.. కొత్త తరాన్ని తయారు చేసుకోవడం.. ఇలాంటి లక్షణాలతో చంద్రబాబు ఓ జనరేషన్‌కు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారంటే అతిశయోక్తి కాదు. అందుకే చంద్రబాబు వంటి లీడర్‌ నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్ ఆఫ్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: