కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఏపీ, తెలంగాణ నుంచి ఇటీవల ఐదుగురికి మంత్రి పదవులు దక్కాయి. మొత్తం 72 మంది మంత్రులకు సంబంధించిన శాఖలను ప్రకటించారు. క్యాబినెట్ ర్యాంక్ హోదాతో పౌర విమానయాన శాఖ కింజరపు రామ్మోహన్ నాయుడు కి లభించింది. గతంలో ఈ శాఖను ఉత్తరాంధ్రకు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు చేపట్టారు. ఆయన నాలుగేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు. ఇక ఇప్పుడు మరో సారి అదే శాఖను బీజేపీ టీడీపీకి కేటాయించింది.


ప్రస్తుతం ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం జరగుతోంది. దీనిని వేగవంతంగా పూర్తి చేయడానికి కేంద్ర మంత్రి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అమరావతి రాజధాని కాబట్టి విజయవాడ లో ఎయిర్ పోర్టు నిర్మాణంతో పాటు గన్నవరం, తిరుపతి, విశాఖ లో మరిన్ని విమాన సర్వీసులను తీసుకువచ్చే వీలుంటుంది.


ఇక గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కి రూరల్ డెవలప్ మెంట్ సహాయ శాఖ. అలాగే కమ్యూనికేషన్ కూడా. ఈ రెండు కీలక మైన శాఖలే. అలాగే బీజేపీకి చెందిన శ్రీనివాస వర్మకు కూడా ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించడంతో పాటు సొంత గనులు కేటాయించే అవకాశం ఉంటుంది.  ఇక ఈ మూడు శాఖలు కీలకమైనవే. ఇవి ఏపీకి కేటాయించడం సంతోషకర విషయం.


ఇక తెలంగాణ విషయానికొస్తే.. గత ఐదేళ్లలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి ప్రాధాన్యం పెరిగి క్యాబినెట్ హోదా లభించింది. పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి నుంచి తప్పించి కీలకమైన బొగ్గు గనుల శాఖను అప్పగించారు. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కి అగ్రనేత అమిత్ షా నిర్వహిస్తున్న హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. గతంలో ఈ పదవిని కిషన్ రెడ్డి చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: