ఇటీవల వైసీపీ నేతలు తమ ఓటమికి కారణం ఈవీఎంల ట్యాంపరింగే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మాజీ సీఎం జగన్‌ కూడా ఇదే మాట అంటున్నారు. బ్యాలెట్ ద్వారానే పోలింగ్ జరగాలని ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. అయితే.. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా పాత బైట్లన్నీ బయటకు తీస్తోంది. గతంలో చంద్రబాబు ఇదే తరహాలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై నానా రచ్చ చేశారు. అప్పట్లో వైసీపీ నేతలు, జగన్ సహా అంతా ఈవీఎంలను సపోర్టు చేశారు.


ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్సయింది. అయితే.. అసలు వైసీపీ నేతలు ఎందుకు ఈవీఎంలను టార్గెట్‌ చేస్తున్నారు. దీనిపై మాజీ వైసీపీ నేత ఒకరు క్లారిటీ ఇస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమంటున్నారంటే.. వైసీపీ ఓటమి తర్వాత వైకాపా నేతలు ఈవీఎంల ది తప్పు అంటున్నారని.. కానీ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అంటున్నారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు చూసుకోకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు.


ఒకవేళ ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగితే బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గుతాయని ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. 2019లో వైసీపీ 151 స్థానాలు గెలిస్తే అప్పుడు జగన్ నా కష్టమే అన్నారని..  ఎవరి శ్రమా లేదన్నారని ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీల వల్ల ఒడిపోయామని జగన్ చెబితే.. నేతలు తిరుగుబాటు చేస్తారని నోరు లేని ఈవీఎంలపై పడ్డారని ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.


నా వ్యక్తిత్వ హననాన్ని, నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని సోషల్ మీడియా ద్వారా 2 కోట్లు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఖర్చు పెట్టారంటున్న ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. స్వయంగా ఆదాల కుడిభుజం ,వైకాపా రాష్ట్ర కార్యదర్శి వైవీ రామిరెడ్డి  చెప్పారన్నారు. నా భార్య, పిల్లలు ఏం చేశారంటూ భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. దీనిపై ఆదాలప్రభాకరరెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: