భట్టి విక్రమార్క నిన్నటికి, ఇవాల్టికి మాట మార్చారని.. బొకేలు ఇచ్చుకుంటూ కేంద్రం పై పోరాటం చేస్తున్నారని.. రెండు పులులు గుహలోకి పోయి మేకతోలు కప్పుకున్నట్లుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన శ్రావణి బ్లాకును వేలంలో ఉంచారా... తీసివేశారా... ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. కిషన్ రెడ్డి, భట్టి విక్రమార్క... ఇద్దరు మిత్రులుగా ఉన్న భాజపా, కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారు.
తెలంగాణ ప్రజల హక్కు శ్రావణి బ్లాకును వేలం నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నామన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. కిషన్ రెడ్డి దురదృష్టవంతులు... ఎన్ని పదవులు వచ్చినా రాష్ట్రానికి పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. రైల్వే స్టేషన్ లో ఒక పాత లిఫ్ట్ కు మాత్రమే మరమ్మత్తులు చేసి కిషన్ రెడ్డి ప్రారంభించారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు. కొత్త పదవితో మొదటి రోజే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే పనికి కిషన్ రెడ్డి శ్రీకారం చుట్టారని.. రాష్ట్ర హక్కులకు తూట్లు పొడిచారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
బాల్క సుమన్ సహా ఉద్యమకారులను అక్రమంగా అరెస్ట్ చేశారు, వారిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. వారు ఎవరి ఇంటిపైకి దాడి చేయడానికి వెళ్ళలేదని.. మా పార్టీ ఎమ్మెల్యే పోచారం ఇంటికి సీఎం ఎందుకు వచ్చారో తెలుసుకుందామని పోయారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడడం దురదృష్టమన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. లోక్ సభ ఎన్నికలు ఫలితాల రోజు కూడా కేసీఆర్ తోనే పోచారం ఉన్నారన్నారు.