అబ్బే.. అవి పర్యాటక శాఖ భవనాలు.. సీఎం కోసం కట్టింది కావని వైసీపీ వాళ్లు కవర్ చేసుకున్నా.. ఆ ప్యాలస్‌లు కట్టిన తీరు చూస్తే సామాన్య విడిది భవనాలు కావని తెలుస్తూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో జగన్‌ను నిత్యం విమర్శించే ఓ పత్రికాధిపతి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు తన వ్యాసంలో రాశారు. జగన్‌లో సాధారణ లక్షణాలు ఉండివుంటే తన నివాసం కోసం రుషికొండపై 550 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి మాయామహల్ నిర్మించుకొని ఉండేవారు కాదని ఆన అంటున్నారు.
తాను నివసించినా నివసించకపోయినా ఊరికో ప్యాలెస్ నిర్మించుకోవడం జగన్ నైజం అంటున్న ఆ పత్రికాధిపతి.. పూర్వం రాజులు మాత్రమే ఇలా వేసవి, శీతాకాల విడిది కోసం ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని గుర్తు చేస్తున్నారు. రుషికొండపై ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్‌లోకి అడుగుపెట్టకుండానే జగన్ అధికారం కోల్పోయారని... హైదరాబాద్, బెంగళూరుల్లో సొంత డబ్బుతో ప్యాలెస్‌లు నిర్మించుకున్నందున అప్పుడు ప్రజలు పట్టించుకోలేదని ఆయన అంటున్నారు.
తాడేపల్లి ప్యాలస్ చుట్టూ 30 అడుగుల ఎత్తులో గ్రిల్‌ను నిర్మించుకున్నారంటే జగన్ ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని భావించాల్సి ఉంటుందని సదరు పత్రికాధిపతి రాసుకొచ్చారు. జగన్ మానసిక పరిస్థితిపై మానసిక వైద్యులు పరిశోధనలు చేయవలసిన అవసరం ఉందంటున్నారా పత్రికాధిపతి.