టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ర్టీల సినీ ప్రియులు ఇప్పుడంతా కల్కీ జనం చేస్తున్నారు. ఈ సినిమాను మన దేశంలో మాత్రమే కాదు. విదేశీయులు సైతం వీక్షిస్తున్నారు. కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. చూసేది తెలుగు సినిమానా.. లేక హాలీవుడ్ సినిమానా అనే రేంజ్ ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రీ ఇంటర్వెల్ సినిమా ఒక హైప్ ఇచ్చిందని.. చివరి 20 నిమిషాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటున్నారు.


నాగ్ అశ్విన్ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లారు అని సినీ ప్రియులు కొనియాడుతున్నారు. ఇక కల్కి చిత్రంలో నాగ్ అశ్విన్ పాన్ ఇండియా వరల్డ్ లో మంచి క్రేజ్ అందుకున్నాడు. ఆడియెన్స్ ను ఎలాంటి సీన్లతో మెప్పించాలో అతనికి బాగా అర్థం అయినట్లు ఉంది. సినిమాలో అతిథి పాత్రలు ఎక్కువగా ఉండటమే కాక.. ప్రతి పాత్ర ప్రేక్షకులను మెప్పించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాత్రలను సర్ ప్రైజ్ గా ఉంచాడు.


దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, మృణాల్ ఠాకూర్, ఇలా ఎంతో మంది ఈ సినిమాలో అతిథి పాత్రలో సందడి చేశారు. అయితే ఇందులో ఓ సరికొత్త అంశం తెరపైకి వచ్చింది. అదేంటంటే..  నాగ్ అశ్విన్ కి సెంటిమెంట్ హీరోగా విజయ్ దేవరకొండ ఉంటున్నారు. ఎందుకంటే ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. అలాగే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో హీరో నానితో పాటు విజయ్ కూడా నటించారు.


అంతే కాకుండా మహా నటి సినిమాలో జర్నలిస్ట్ గా విజయ్ చేశారు. ఇక తాజాగా విడుదల అయిన కల్కి సినిమాలో ఈయన కనిపించింది తక్కువ సేపే అయినా.. అర్జునుడి పాత్రకు మాత్రం ఒక హైప్ వచ్చింది. ఇక ఈ సినిమా హిట్ టాక్ రావడంతో నాగ్ అశ్విన్ కు విజయ్ దేవరకొండ సెంటిమెంట్ గా మారారని సినీ ప్రియులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: