అధికారంలోకి వచ్చిన నాయకుడు ఏం చేయాలి.. ప్రజల సమస్యలు తీర్చారు.. ప్రజల ముందుకు పాలన అందించాలి. వారికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి. అనేక పథకాలు ప్రవేశ పెట్టాలి. వాటిని ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు అందేలా చూసుకోవాలి.. ఇదే కదా నాయకుడు చేయాల్సింది. జగన్ కూడా ఇలాగే అనుకున్నాడు. అనుకోవడమే కాదు.. అక్షరాలా అలాగే చేద్దామని ప్రయత్నించాడు. గతంలో పథకాలు ప్రజల ఇంటికి చేరడంలో ఉన్న ఇబ్బందులు అధ్యయనం చేయించాడు.


పథకాలు నేరుగా ప్రజల ఇంటికి చేరేందుకు ఓ కొత్త వ్యవస్థ అవసరమని భావించాడు. అందుకే వాలంటీర్‌ వ్యవస్థ ఏర్పాటు చేశాడు. అది సూపర్‌ సక్సస్‌ అయ్యింది. జనం ఇంటికి పథకాలు చేరాయి. ఏ పథకం రావాలన్నా వాలంటీర్‌ను కేకేస్తే వచ్చేస్తుంది. ఏ సర్టిఫికెట్ కావాలన్నా వాలంటీర్‌కు ఫోన్‌ చేస్తే వచ్చేస్తుంది. ఏ సమస్య ఉన్నా.. వాలంటీర్‌ను ఫోన్‌ కొడితే తీరిపోతుంది. నిజంగానే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు తెగ నచ్చేసింది. అహా ఓహో అనుకున్నారు.


మరి ఇంత చేస్తే.. జనం ఖుషీగా ఉంటే.. మరి ఓట్లు రాలాలి కదా.. కానీ.. ఓట్లు చూస్తే చరిత్రలోనే ఏ నేతకూ దక్కని తిరస్కరణ ఎదురైంది. ఏకంగా 160పైగా స్థానాల్లో జగన్ పార్టీని చిత్తుగా ఓడించారు. మరి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తే ఎన్నో కారణాలు. వాటిలో ముఖ్యంగా కనిపించేది ఈ వాలంటీర్‌ వ్యవస్థ. అదేంటి జనానికి మేలు చేసిన వ్యవస్థతో ఇబ్బందులేంటి అంటే అక్కడే ఉంది మ్యాజిక్కు. వాలంటీర్ల విషయంలో జగన్‌  ఓ చిన్న లాజిక్‌ మిస్సయ్యాడు. అదే జగన్ కొంప ముంచింది.


గతంలో ప్రజలకు ఏదైనా సమస్య వస్తే.. అధికారంలో ఉన్న పార్టీ నాయకుడి దగ్గరకు వెళ్లేవాడు. వాళ్లు ఆ పని చేసి పెట్టేవాళ్లు..దాంతో ఆ పార్టీ నేతలకు పరపతి పెరిగేది. కానీ వాలంటీర్లు వచ్చేశాక ఆ సీన్ మారిపోయింది. పార్టీ నేతలకు గుర్తింపు లేకుండా పోయింది. దాంతో.. వాళ్లు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల్లో దెబ్బేశారు. చివరి రోజుల్లో వాలంటీర్లతో రాజీనామాలు చేయించడం కూడా బెడిసికొట్టింది. దీంతో ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉన్న ఓ వ్యవస్థ జగన్‌కు ప్రతికూలంగా మారింది. ఇదెలా ఉందంటే.. ఆపరేషన్‌ సక్సస్‌.. పేషెంట్‌ డెడ్‌ అన్నట్టుగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: