రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. దీంతో పాటు పనులు పూర్తి చేసే బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాయి. అయితే 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. అంతకు ముందు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. కాలువలు తవ్వి.. పనులను కొంత మేర ముందుకు తీసుకువచ్చారు.


ఆ తర్వాత 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును కొంత మేర ముందుకు తీసుకువెళ్లారు. సగం పనులు పూర్తి చేసి దాదాపు 70 శాతం మేర పూర్తైందని చెప్పి.. పోలవరం సందర్శనకు ఏపీ ప్రజలను తరలించారు. ఇక 2019లో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. తన తండ్రి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో తేదీలతో సహా ప్రకటించారు. కానీ పనులు ముందుకు సాగలేదు.


ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం మారింది. చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. ఇప్పుడు పోలవరం పూర్తి చేయడానికి నాలుగేళ్లు సమయం పడుతుందని కుండ బద్ధలు కొట్టారు. అయితే పోలవరం ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి బాధ్యులు ఎవరూ అనేది ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ, వైసీపీలు మీరంటే మీరే అని ఒకరిని ఒకరు విమర్శించుకోవడం పరిపాటిగా మారింది.


అయితే సీపీఎం నేత రాఘవులు .. పోలవరం పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణం అని విమర్శించారు. కాపర్ డ్యాం కట్టకుండా డయా ఫ్రం వాల్ నిర్మించడంతోనే పోలవరం నాశనం అయిందని అని పేర్కొన్నారు. కాపర్ డ్యాం కడితే నీళ్లు నిల్వ ఉండి నిర్వాసితులు మునిగిపోతారు. దీనికోసం ముందు కాపర్ డ్యాం కట్టకముందే నిర్వాసితులకు  నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలి. ఈ పని అంతా 2017 లో చంద్రబాబు సర్కారు చేయాలి. కానీ ఆయన చేయలేదు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: