టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో శాంతి భద్రతలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయన 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసినా ఎప్పుడూ ఇలా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పలేదు. ఎంపీలను, ఎమ్మెల్యేలను తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా అడ్డుకోవడం, ప్రత్యర్థి పార్టీలకు చెందిన కార్యకర్తలు హత్యలకు గురి కావడం వంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు.


సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉన్నా.. లా అండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు చాలా కఠినంగా ఉండేవారు. ఈ విషయం ఆయన గత పాలన చూసిన వారికి ఎవరికి అయినా అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.


ఇటీవల శ్రీకాళహస్తి వద్ద  కొత్తకండ్రికి చెందిన పారి ఎర్రయ్య తన పదకొండేళ్ల పిల్లాడితో కలిసి శ్రీకళాహస్తిలోని తన స్వగ్రామానికి వెళ్తుంటే.. అదే గ్రామానికి చెందిన వెంకట సుబయ్య, సురేశ్ లు అటకాయించారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తావా అంటూ దాడి చేశారు. ఎర్రయ్య మెడకు టవల్ చుట్టి ఉరి వేసి చంపేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎర్రయ్య కుమారుడు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్లి జనాలను పిలుచుకొని వచ్చారు. గ్రామస్థులు అడ్డుకోవడంతో టీడీపీ నేతలు ఎర్రయ్యను వదిలి పరారయ్యారు. బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  ఎస్సై తెలిపారు.


మరోవైపు ఇంకొక ఘటనలో వైసీపీకి చెందిన వ్యక్తి రియల్ ఎస్టేట్ ను ధ్వంసం చేశారు. గన్నవరం మండలం ముస్తాబాద్ లో వైసీపీ నేత మేతినేని వెంకట శివ సత్య నారాయణ బాబుకి చెందిన భూముల్లో ఓ ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన బొబ్బా ప్రసాద్ తో పాటు మరికొందరు టీడీపీ నేతలు ఆచ్ ని కూల్చడంతో పాటు రోడ్లను ఇష్టారీతిన జేసీబీతో ధ్వంసం చేశారు. మొత్తం మీద ఏపీలో ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: