వినుకొండ వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యతో వైఎస్ జగన్ ఇటీవల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ ఘోర పరాజయం తర్వాత జగన్ ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి.  తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు కలుస్తున్నా జనంలోకి వచ్చింది మాత్రం వినుకొండ పర్యటనతోనే. 151 సీట్ల నుంచి ఒక్కసారిగా 11 సీట్లకు పరిమితం కావడంతో వైసీపీ పనైపోయిందని టీడీపీ నాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తూ వచ్చారు.


వాస్తవంగా చెప్పాలంటే జగన్ ఏమంత దారుణంగా ఓడిపోలేదు. దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి టీడీపీకి మించి దేశంలోనే అత్యధిక ఓటు బ్యాంకు పొందిన  ఐదో పార్టీగా వైసీపీ నిలిచింది. అయితే మాత్రం పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని అందరిలో భయం నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ తొలిసారి ప్రజల్లోకి వస్తుండటంతో స్పందన ఎలా ఉంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.


జగన్, పవన్ కల్యాణ్ లు ప్రజల్లో క్రేజ్ ఉన్న నాయకులు. వీరు వస్తున్నారంటే చాలు జనం స్వచ్ఛందంగా వీరిని చూసేందుకు తరలివస్తుంటారు.  కానీ అధికారంలో ఉన్న సమయంలో డబ్బులిచ్చి, బస్సులేసి జనాన్ని తరలించారని.. ట్రాఫిక్ ఆపి జనాలను చూపించేవారని టీడీపీ అప్పట్లో విమర్శించింది. ఇకపై అలాంటి వసతులు ఉండవు కాబట్టి జనం వచ్చే పరిస్థితి లేదని పేర్కొంది.


కానీ వీటన్నింటికి జగన్ వినుకొండ పర్యటన సమాధానం చెప్పినట్లయింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం పది గంటలకు మొదలైన జగన్ పర్యటన దారి పొడవునా వస్తున్న జనాన్ని కలుస్తూ.. వారిని పరామర్శిస్తూ..  రెండున్నర గంటలు పట్టాల్సిన జర్నీ ఏడు గంటలకు పైగా  సాగింది. అయితే దీనిపై ఎల్లో మీడియా విచిత్ర ప్రచారం చేసింది. జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొన్నారని రాశారు. అదే పవన్, చంద్రబాబు, లోకేశ్ లు చేస్తే ప్రజలు ఇబ్బందులకు గురి కారా. అప్పుడు అంటే వైసీపీ ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడు టీడీపీ కూటమే అధికారంలో ఉంది కదా. అంటే జగన్ ర్యాలీకి కంట్రోల్ చేయలేనంత స్పందన వచ్చిందని ఎల్లో మీడియా చెప్పినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: