ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉండే అమెరికా రాజకీయ మనుగడను భారత్ శాసిస్తోందా? అక్కడి పాలిటిక్స్ ని మనోళ్లు కంట్రోల్ చేస్తున్నారా? అక్కడి వర్థమాన రాజకీయాలు భారతదేశం మీదనే ఆధారపడ్డాయా? అధికార పీఠం దక్కాలంటే ప్రవాస భారతీయులే కీలకాధారమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.


ఇప్పుడు అమెరికాలో భారతదేశం, ముఖ్యంగా దక్షిణాది వారి హవా కనిపిస్తోంది. ప్రధాన రాజీకయ పక్షాల ధోరణి కంప్లీట్ గా మారిపోయింది. అమెరికాలో భారతీయ సంతతి అంటే పేరుకు వలస జీవులే. కానీ వీళ్లే అక్కడ రాజ్యాధికారంలో పాలు పంచుకునే స్థితికి చేరుతున్నారు. నిజానికి అమెరికా జనాభాలో భారతీయుల సంఖ్య 1.85 శాతమే. ఇప్పుడు వీరు ఆర్థిక, రాజకీయ రంగాల్లో కీలక దశకు చేరుకున్నారు. అందుకే అమెరకా ఉపాధ్యక్ష పదవికి తెలుగింటి ఆడ బిడ్డకు ఉషా చిలుకూరి భర్తం జేడీ వాన్స్ ని ట్రంప్ ప్రకటించారు.


2020 ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తొలిసారిగా భారతీయ సంతతికి చెందిన మహిళను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. కమలా హారిస్ తల్లిది ఇండియా. తండ్రిది జమైకా. ఫలితంగా ప్రవాస భారతీయ ఓటు బ్యాంకు డెమొక్రట్లకు మద్దతు పలికింది. అందుకే ఈ సారి ఈ ఓటు బ్యాంకుపై కన్నేసిన ట్రంప్.. ఆంధ్రా అల్లుడిని ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. ఇప్పుడు ట్రంప్ గెలుపులో వాన్స్ పాత్ర కీలకం కానుంది.


ఇప్పుడు అమెరికా డెమొక్రటిక్ అధ్యక్ష పదవి  నుంచి జో బైడెన్ స్వచ్చందంగా తప్పుకున్నారు. ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షరాలు, భారతీయ సంతతి బిడ్డ కమలా హారిస్ ను ఆయన ప్రతిపాదించారు. ఇక ఇదే సమయంలో ఈ సారి జరిగే ఎన్నికలకు అంతా బాగా ఉంటే.. వాన్స్ ని ట్రంప్ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో రెండు సార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం లేదు. అందువల్ల అన్నీసక్రమంగా జరిగితే.. వచ్చే ఎన్నికల్లో లేదా ఆపై వచ్చే ఎన్నికల్లో అయినా కచ్చితంగా తెలుగింటి వారే వైట్ హౌస్ లో కాలుపెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: